ధోనీకి చాలా మంది అభిమానులుండొచ్చు.. కానీ లక్కీ ఫ్యాన్ మాత్రం ఇతడే. ఎందుకంటే తాను కొత్తగా కొనుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై ధోనీ ఆటోగ్రాఫ్‌ను పొందడం అంటే మామూలు విషయం కాదు. భారత మాజీ సారథి ఇచ్చిన ఈ ఆటోగ్రాఫ్ అతడికి జీవితాంతం గుర్తుండిపోతుంది.
సాధారణంగా క్రికెటర్లు జెర్సీలు, టీషర్ట్‌లు లేదా క్యాప్‌లపై అభిమానులకు తమ ఆటోగ్రాఫ్‌లను ఇస్తుంటారు. అయితే, ఝార్ఖండ్‌కు చెందిన ఓ వ్యక్తికి ధోనీ అంటే అభిమానం. తాను కొత్తగా కొనుగోలు చేసిన బైక్‌పై ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఆరాటపడ్డాడు. షోరూంలో బైక్ కొనుగోలు చేసిన వెంటనే నేరుగా రాంచీలోని ఝార్ఖండ్ క్రికెట్ స్టేడియానికి వెళ్లాడు.
ధోనీ ప్రాక్టీస్ ముగించుకుని వస్తోన్న సమయంలో తన ఆటోగ్రాఫ్ కావాలని అడిగాడు. అభిమాని అడిగిన దానిని ధోనీ కాదంటాడా. ఏమాత్రం తడుముకోకుండా అతడి రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ బైక్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
A lucky fan got @msdhoni's autograph in his new beast!❤😍 #Dhoni #MSDhoni #RanchiDiary pic.twitter.com/kMhvWmYome
— MS Dhoni Fans Official (@msdfansofficial) October 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">A lucky fan got @msdhoni's autograph in his new beast!❤😍 #Dhoni #MSDhoni #RanchiDiary pic.twitter.com/kMhvWmYome
— MS Dhoni Fans Official (@msdfansofficial) October 31, 2019A lucky fan got @msdhoni's autograph in his new beast!❤😍 #Dhoni #MSDhoni #RanchiDiary pic.twitter.com/kMhvWmYome
— MS Dhoni Fans Official (@msdfansofficial) October 31, 2019
ఇవీ చూడండి.. స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్‌తో రోహిత్..!