నేడు ప్రపంచకప్‌కు వెళ్లే టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. అందులో పంత్‌ను తప్పించడం తనను ఆశ్చర్యపరిచిందని మాజీ భారత కెప్టెన్ సునీల్ గావస్కర్ చెప్పారు. రోజు రోజుకు అతడు ఆటను మరింత మెరుగు పర్చుకుంటున్నాడని కితాబిచ్చారు.
33 ఏళ్ల దినేశ్ కార్తిక్.. ప్రపంచకప్ భారత జట్టు రెండో వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. మే 30 నుంచి ఇంగ్లండ్‌లో ఈ మెగాటోర్నీ ఆరంభం కానుంది.
ఇది నాకు ఒకింత ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతం పంత్ ఫామ్ చూడండి. ఐపీఎల్‌లోనే కాకుండా అన్ని ఫార్మాట్లలోనూ ఆకట్టుకుంటున్నాడు. వికెట్ కీపింగ్‌లోనూ రాణిస్తున్నాడు. -సునీల్ గావస్కర్, టీమిండియా మాజీ కెప్టెన్
తమిళనాడుకు చెందిన విజయ్ శంకర్‌ను ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయడం సబబేనని గావస్కర్ అన్నారు.
విజయ్ శంకర్ గతేడాది నుంచి క్రికెటర్‌గా ఆకట్టుకుంటున్నాడు. పూర్తి ఆత్వవిశ్వాసంతో ఆడుతున్న అతడు టీమిండియాకు అన్ని విభాగాల్లోనూ ఉపయోగపడతాడు. - సునీల్ గావస్కర్, టీమిండియా మాజీ కెప్టెన్
ఇది చదవండి: ప్రపంచకప్‌లో తలపడే బ్లూ టైగర్స్ వీరే..