టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఏ ముహూర్తాన హెలికాప్టర్ షాట్‌ను పరిచయం చేశాడో ప్రపంచమంతా ఫిదా అయిపోయింది. అంతర్జాతీయ, దేశవాళీ, గల్లీ క్రికెట్లోనూ ఈ షాట్‌ను అనుకరించేందుకు క్రికెటర్లంతా ప్రయత్నిస్తుంటారు. మహీలా బాదేస్తే ప్రత్యేకంగా ఫీలవుతారు.
ఇటీవలే ఓ ఏడేళ్ల అమ్మాయి హెలికాప్టర్ షాట్లు బాదేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అందులో ఆమె ప్రతి బంతినీ హెలికాప్టర్ షాట్‌గా మలిచేందుకే ప్రయత్నించింది. దాంతో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, సంజయ్ మంజ్రేకర్ ఆమెకు అభిమానులుగా మారిపోయారు. ఆకాశ్ చోప్రా అయితే హిందీలో తన కామెంటరీని జోడించడం విశేషం. 'అగ్గిపిడుగు... ఆమె మన పరీశర్మ. అత్యంత ప్రతిభావంతురాలు కదా?' అని ట్వీట్ చేశారు. దీనికి మంజ్రేకర్ స్పందించారు.
-
Thursday Thunderbolt...our very own Pari Sharma. Isn’t she super talented? 👏👏 #AakashVani pic.twitter.com/2oGLLLAadu
— Aakash Chopra (@cricketaakash) August 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thursday Thunderbolt...our very own Pari Sharma. Isn’t she super talented? 👏👏 #AakashVani pic.twitter.com/2oGLLLAadu
— Aakash Chopra (@cricketaakash) August 13, 2020Thursday Thunderbolt...our very own Pari Sharma. Isn’t she super talented? 👏👏 #AakashVani pic.twitter.com/2oGLLLAadu
— Aakash Chopra (@cricketaakash) August 13, 2020
'అందరూ హెలికాప్టర్ షాట్‌ను సాధన చేయడం ప్రస్తుతం నేను చూస్తున్నా. వికెట్లకు అత్యంత సమీపంలో ఉండి బంతిని అందుకోవడం సహా అంతర్జాతీయంగా ధోనీ ప్రాముఖ్యం తీసుకొచ్చిన మరో టెక్నిక్ ఇది. ఎదుగుతున్న క్రికెటర్లకు ఇదో గొప్ప షాట్' అని మంజ్రేకర్ అన్నాడు. పరీశర్మది హరియాణాలోని రోహ్‌తక్. టీమ్‌ఇండియా మహిళల క్రికెట్ జట్టుకు ఆడాలన్నది ఆమె కోరికట.