ETV Bharat / sports

అగ్రస్థానంలో ఏ జట్టుది అధి(క)కారం - వన్డే ఫార్మాట్​లో అగ్రస్థానంలో ఎక్కువ కాలం ఉన్న జట్లు

ఐసీసీ ర్యాంకులు ప్రారంభమయ్యాక అగ్రస్థానం కోసం అన్ని జట్లు పోటీపడ్డాయి. ప్రారంభంలో వెస్టిండీస్ తమ ఆధిపత్యాన్ని చూపించగా.. అనంతరం ఆస్ట్రేలియా, దక్షిణాప్రికా తమ జోరును ప్రదర్శించాయి. ఇంగ్లాండ్, భారత్​ కూడా ఈ పోటీలో నిలిచాయి. మొత్తంగా వన్డేల్లో అగ్రస్థానంలో ఎక్కువ రోజులు నిలిచిన జట్లపై ఓ లుక్కేద్దాం.

ఇంగ్లాండ్
ఇంగ్లాండ్
author img

By

Published : Feb 12, 2020, 5:46 AM IST

Updated : Mar 1, 2020, 1:16 AM IST

జనవరి 5, 1971 క్రికెట్ అభిమానులు గుర్తుంచుకోవాల్సిన రోజు. సరిగ్గా ఈరోజే ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్​ జరిగింది. మెల్​బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​ చరిత్రలో నిలిచిపోయింది. అలాగే క్రికెట్ అభిమానులకు కొత్త ఫార్మాట్​ను పరిచయం చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వన్డే సామ్రాజ్యాన్ని ఏలిన.. ఏలుతున్న దేశాలెన్నో. నాలుగేళ్లకోసారి ప్రపంచకప్​ అంటూ వచ్చిన తర్వాత ర్యాంకింగ్స్​కు ప్రాముఖ్యత మరింత పెరిగింది. మొదట వెస్టిండీస్​ తన ప్రాబల్యాన్ని చాటగా.. తర్వాత ఆస్ట్రేలియా అగ్రగామిగా దూసుకెళుతూ ఐసీసీ టోర్నీల్లో ఆధిపత్యం చూపించింది. 2019 ప్రపంచకప్​లో గెలిచిన ఇంగ్లాండ్​ కూడా ఈ ఫార్మాట్​లో తనదైన ముద్ర వేసింది. అలా ఏ జట్లు వరుసగా ఎక్కువ కాలం 50 ఓవర్ల ఫార్మాట్లో అగ్రస్థానంలో ఉన్నాయో చూద్దాం.

5. భారత్ (12 నెలలు)

జనవరి 2013 నుంచి డిసెంబర్ 2013 వరకు భారత్​ వన్డేల్లో అగ్రస్థానంలో ఉంది. అంటే 12 నెలలు దాదాపుగా అగ్రగామిగా కొనసాగింది. ఈ కాలంలో ఇండియా 32 మ్యాచ్​లాడి 22 మ్యాచ్​ల్లో గెలుపొందింది. విజయశాతం 68.75గా ఉంది. ధోనీ కెప్టెన్​గా ఉన్న ఈ సమయంలో మొదట పాకిస్థాన్​తో జరిగిన సిరీస్​ను 2-1 తేడాతో కోల్పోయింది. కానీ తర్వాత ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్​ను 3-2 తేడాతో గెలుచుకుని గాడిలో పడింది. అనంతరం ఇదే ఏడాదిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. తర్వాత వెస్టిండీస్, జింబాబ్వే, ఆస్ట్రేలియాలతో సిరీస్​లను కైవసం చేసుకుంది. బెంగళూరు వేదికగా ఆసీస్​తో జరిగిన చివరిదైన ఏడో వన్డేలో రోహిత్ శర్మ (209) బాదిన డబుల్ సెంచరీ ఈ సిరీస్​కు హైలెట్​గా నిలిచింది. కానీ చివర్లో సౌతాఫ్రికాతో జరిగిన రెండు వన్డేల్లో ఓడి ఏడాదిని పరాజయంతో ముగించింది టీమిండియా.

భారత్
భారత్

4.ఇంగ్లాండ్ (14 నెలలు)

మే 2018లో అగ్రస్థానం కైవసం చేసుకున్న ఇంగ్లాండ్​ తర్వాత 14 నెలల పాటు ఆధిపత్యం వహించింది. ఈ 14 నెలల్లో ఇంగ్లీష్ జట్టు మొత్తం 30 మ్యాచ్​లాడి 22 మ్యాచ్​ల్లో విజయం సాధించింది. విజయ శాతం 73.33గా ఉంది. జూన్ 2018లో స్కాట్లాండ్​ చేతిలో ఓడిన ఈ జట్టు తర్వాత పుంజుకుంది. ఆస్ట్రేలియాపై 5-0, భారత్​పై 2-1 తేడాతో సిరీస్​లను కైవసం చేసుకుంది. వెస్టిండీస్​తో జరిగిన సిరీస్ మాత్రం 2-2తేడాతో సమమైంది. అనంతరం 2019లో జరిగిన ప్రపంచకప్​లో ఫేవరెట్లుగా బరిలోకి దిగి తొలిసారి విజేతగా నిలిచింది. ఈ మెగా టోర్నీ సమయంలో భారత్​ అగ్రస్థానానికి చేరినా వెంటనే మళ్లీ ఇంగ్లాండ్​ ఆ స్థానానికి చేరుకుంది.

ఇంగ్లాండ్
ఇంగ్లాండ్

3. దక్షిణాఫ్రికా (46 నెలలు)

మే 1996 నుంచి ఫిబ్రవరి 2000 వరకు దాదాపు నాలుగేళ్లు దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో కొనసాగింది. ఈ కాలంలో సఫారీలకు ఏదైన చేదు అనుభవం ఉందంటే అది 1999 ప్రపంచకప్​లో సెమీస్​లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం మాత్రమే. ఈ సమయంలో సౌతాఫ్రికా మొత్తం 88 మ్యాచ్​లాడి 66 మ్యాచ్​ల్లో విజయం సాధించింది. విజయ శాతం 75గా ఉంది. స్వదేశంలో 36 మ్యాచ్​లాడి 27 మ్యాచ్​ల్లో గెలిచింది. దీనిని దక్షిణాఫ్రికా క్రికెట్​లో అత్యంత విజయవంతమైన కాలంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఈ జట్టు ఎన్నో ఛాలెంజస్​ను ఎదుర్కొంటూ ఢీలా పడింది.

దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా

2.ఆస్ట్రేలియా (52 నెలలు)

పరిమిత ఓవర్ల క్రికెట్​లో ఆస్ట్రేలియాకు గొప్ప రికార్డే ఉంది. ఐసీసీ ఈవెంట్లలో ఈ దేశానికి ఘనమైన రికార్డు ఉంది. అక్టోబర్ 2002 నుంచి జనవరి 2007 వరకు ఆసీస్ అగ్రజట్టుగా కొనసాగింది. ఈ కాలంలో కంగారూ జట్టు 123 మ్యాచ్​లాడి 99 మ్యాచ్​ల్లో గెలిచింది. విజయం శాతం 80.49గా ఉండటం విశేషం.

ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా

1. వెస్టిండీస్ (65 నెలలు)

ఒకప్పుడు వెస్టిండీస్​ పేరు చెబితేనే ప్రత్యర్థి ఆటగాళ్లలో వణుకుపుట్టేది. 1975, 1979 ప్రపంచకప్​లు గెలిచి జోరుమీదున్న కరీబియన్ జట్టు అప్పట్లో భీకరమైన ఫామ్​లో ఉండేది. క్లైవ్ లాయిడ్ సారథ్యంలో ఎన్నో మరపురాని విజయాలను సొంతం చేసుకున్న ఆ జట్టు వన్డే ర్యాంకింగ్స్​లోనూ తమ సత్తాచాటింది. వరుసగా 65 నెలలు అగ్రస్థానంలో కొనసాగి తమ ఆధిపత్యాన్ని చూపించింది. జనవరి 1987- మే 1992 వరకు వెస్టిండీస్ అగ్రస్థానంలో కొనసాగింది. ఈ కాలంలో 98 మ్యాచ్​లాడి 76 మ్యాచ్​ల్లో విజయం సాధించింది. ఎక్కువగా ఆస్ట్ల్రేలియాతో 34 మ్యాచ్​లాడి 26 మ్యాచ్​ల్లో గెలిచింది.

వెస్టిండీస్

Last Updated : Mar 1, 2020, 1:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.