ETV Bharat / sports

పాక్-ఇంగ్లాండ్ టెస్టు: రెండో రోజూ ఆగని వర్షం

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. రెండో రోజూ వెలుతురు మందగించడం, వర్షం పడటం వల్ల ఆట సగంలోనే నిలిచిపోయింది.

పాక్-ఇంగ్లాండ్ టెస్టు: రెండో రోజూ ఆగని వర్షం
పాక్ ఇంగ్లాండ్ రెండో టెస్టు
author img

By

Published : Aug 15, 2020, 6:54 AM IST

ఉదయం వర్షం.. సాయంత్రం వెలుతురు లేమి.. ఈ ధాటికి సౌథాంప్టన్​లో ఇంగ్లాండ్‌-పాకిస్థాన్‌ రెండో టెస్టులో రెండో రోజు ఆట కూడా సవ్యంగా సాగలేదు. తొలి రోజు 45.4 ఓవర్ల ఆటలో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసిన పాక్‌.. రెండో రోజు ఇంకో 40.2 ఓవర్లాడి 223/9తో నిలిచింది. మబ్బులు కమ్మిన వాతావరణంలో ఇంగ్లిష్‌ బౌలర్లు శుక్రవారం కూడా చక్కటి ప్రదర్శన చేసినప్పటికీ.. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (60 బ్యాటింగ్‌) పోరాటం పాక్‌ను ఆలౌట్‌ కాకుండా ఆపింది. బాబర్‌ అజామ్‌ (47; 127 బంతుల్లో 34)తో కలిసి అతను కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆట ఆఖరుకు రిజ్వాన్‌కు తోడు నసీమ్‌ షా (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు.

rizwan
పాక్ బ్యాట్స్​మన్ రిజ్వాన్

ఉదయం వర్షం కారణంగా ఆట గంటన్నర ఆలస్యమైంది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ అజామ్‌, రిజ్వాన్‌ జాగ్రత్తగా తొలి సెషన్లో వికెట్‌ పడకుండా చూసుకున్నారు. విరామానికి స్కోరు 155/5. రెండో సెషన్‌ ఆరంభం కాగానే.. అజామ్‌ను బ్రాడ్‌ (3/56) ఔట్‌ చేయడం.. యాసిర్‌ షా (5)ను అండర్సన్‌ (3/48)ను పెవిలియన్‌ చేర్చడం.. షహీన్‌ షా అఫ్రిది (0) రనౌట్‌ కావడం వల్ల పాక్‌ పనైపోతున్నట్లే కనిపించింది. ఓ దశలో స్కోరు 176/8. కానీ రిజ్వాన్‌ ఎక్కువగా స్ట్రైక్‌ తీసుకుంటూ స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. పాక్‌ను 200 దాటించాడు. 2 పరుగులే చేసిన అబాస్‌తో కలిసి అతను తొమ్మిదో వికెట్‌కు 39 పరుగులు జోడించడం విశేషం. 215 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ పడింది. కొన్ని నిమిషాల్లోనే వెలుతురు మందగించడం వల్ల ఆటను ఆపేశారు. మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.