2022 ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించేందుకు 86 జట్లు పోటీ పడనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) పేర్కొంది. టోర్నీలో పాల్గొనే జట్ల ఎంపిక ప్రక్రియ సుదీర్ఘంగా సాగనున్నట్లు తెలిపింది. 13 నెలల వ్యవధిలో 225 మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ సాగుతుందని చెప్పిన ఐసీసీ.. వచ్చే ఏప్రిల్ నుంచి మ్యాచ్‌లను జరపనున్నట్లు చెప్పింది. హంగేరి, రొమేనియా, సెర్బియా దేశాలు తొలిసారి టీ20 అర్హత పోటీల్లో పాల్గొననున్నాయి. అర్హత మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన నాలుగు జట్లను ప్రపంచ కప్‌నకు ఎంపిక చేస్తారు.
ఆతిథ్య దేశంతో పాటు ర్యాంకింగ్ దృష్ట్యా 11 జట్లు ఇప్పటికే టోర్నీకి అర్హత సాధించాయి. మిగిలిన నాలుగింటితో కలిపి 16 జట్లు ప్రపంచకప్‌లో పోటీపడతాయని ఐసీసీ పేర్కొంది.