వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ నాలుగు లక్షలకుపైగా మెజారిటీతో గెలుపొందారు.
వయనాడ్‌లో ప్రియాంక గాంధీ ఘన విజయం- తొలి అడుగులోనే భారీ సక్సెస్ - ASSEMBLY ELECTION 2024
Published : Nov 23, 2024, 9:41 AM IST
|Updated : Nov 23, 2024, 2:27 PM IST
Assembly Election 2024 : వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ భారీ విజయం సాధించారు. దాదాపు నాలుగు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
LIVE FEED
మాజీ సీఎం తనయుడి ఓటమి
- కర్ణాటకలోకి శిగ్గావ్ ఉప ఎన్నికలో మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై తనయుడు భరత్ బొమ్మై ఓటమి
- 13 వేలకుపైగా ఓట్లతో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్
వయనాడ్ లోక్‌సభ స్థానానికి నిర్వహించిన ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో వయనాడ్‌లో రాహుల్‌గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజార్టీ దక్కింది. వయనాడ్‌లో గెలుపొందిన ఆయన, ఈ స్థానం నుంచి తప్పుకోవడంతో ఉపఎన్నిక నిర్వహించారు. దీంతో తొలిసారిగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు.
- కర్ణాటకలోని శిగ్గావ్, సండూర్, చెన్నపట్టణలో కాంగ్రెస్ గెలుపు
- చెన్నపట్టణ నియోజకవర్గంలో నిఖిల్ కుమారస్వామి ఓటమి
- అసోంలోని బెహాలిలో భాజపా గెలుపు
- బిహార్‌లోని ఇమామ్ గంజ్‌లో హిందూస్థానీ అవామ్ మోర్చా విజయం. బెలగంజ్‌లో జేడీయూ గెలుపు
- కేరళలోని పాలక్కడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం
తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సత్తా చాటుతున్నారు. వయనాడ్ కౌంటింగ్‌లో భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో రాహుల్‌గాంధీకి వచ్చిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీని అధిగమించారు. ప్రస్తుతం 3.67 ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తున్నారు.
ప్రజల దగ్గరకు వెళ్లిన ప్రతి చోట వయనాడ్ అభివృద్ధి గురించే మాట్లాడాను: నవ్య హరిదాస్
- అభివృద్ధి గురించి ఆలోచించి ప్రజలు ఓటేస్తారని భావించాను
- కానీ, పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది
- వయనాడ్‌లో భాజపా అధికారంలో లేకపోవడం వల్ల గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు
- 3.57 లక్షల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ
బంగాల్‌లోని సితాయ్ నుంచి టీఎంసీ అభ్యర్థి సంగీతా రాయ్ విజయం
- పంజాబ్ చబ్బేవాల్ ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్థి ఇషాంక్ కుమార్ గెలుపు
బంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ హవా
- ఆరు స్థానాల్లోనూ టీఎంసీదే ఆధిక్యం
- కర్ణాటకలో మూడు చోట్ల ముందంజలో కొనసాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థులు
- గుజరాత్ వావ్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- అసోంలో బీజేపీ 2, కాంగ్రెస్ 1, ఏజీపీ 1, యూపీపీ ఒక స్థానంలో ఆధిక్యం
- పంజాబ్ ఉప ఎన్నికల్లో 3 చోట్ల ఆప్, ఒక స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యం
- ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఉప ఎన్నికలో బీజేపీ ముందంజ
- యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ 6, ఎస్పీ 3, ఆర్‌ఎల్డీ ఒక స్థానంలో ఆధిక్యం
- రాజస్థాన్‌లో బీజేపీ 3, కాంగ్రెస్ 2, భారత్ ఆదివాసీ 2 స్థానాల్లో లీడ్
- మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
- వయనాడ్‌లో ప్రియాంక గాంధీకి 3.12 లక్షల ఓట్ల మెజార్టీ
- వయనాడ్ ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న ప్రియాంకగాంధీ
- వయనాడ్ ఉపఎన్నికలో భారీ ఆధిక్యం దిశగా ప్రియాంకగాంధీ
- వయనాడ్ ఉపఎన్నికలో 2.70 లక్షల ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక
- తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన ప్రియాంకగాంధీ
- గత ఎన్నికల్లో వయనాడ్‌లో రాహుల్‌గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజార్టీ
- రాహుల్‌గాంధీ రాజీనామాతో వయనాడ్ లోక్‌సభకు ఉపఎన్నిక

- వయనాడ్ ఉపఎన్నికలో 2 లక్షల ఓట్ల మెజార్టీకి చేరువలో ప్రియాంకగాంధీ

లక్ష దాటిన ప్రియాంక గాంధీ మెజార్టీ
- వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే ఆధిక్యం
- ఫలితాల్లో ఆది నుంచి వెనుకంజలో కొనసాగుతున్న భాజపా అభ్యర్థి నవ్య హరిదాస్
చెన్నపట్టణ నియోజకవర్గంలో నిఖిల్ కుమారస్వామి ఆధిక్యం
- జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ సీఎం, ప్రస్తుత కేంద్రమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్
తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వయనాడ్ ఉపఎన్నిక ఫలితాల్లో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం 55వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్యహరిదాస్ ఆ స్థానంలో పోటీలో ఉన్నారు.
బంగాల్ ఉప ఎన్నికల్లో అధికార టీఎంసీదే ఆధిక్యం
- మేద్నీపూర్ ఉప ఎన్నికలో టీఎంసీ అభ్యర్థి సుజయ్‌హజ్రా ఆధిక్యం
- నైహతిలో సనత్ దే ముందంజ
- మదారిహత్‌లో జయప్రకాశ్ టొప్పొ లీడ్
- సితాయ్ అసెంబ్లీ స్థానంలో సంగీతా రాయ్ ఆధిక్యం
పంజాబ్‌లో ఆప్ జోరు
పంజాబ్‌లోని బర్నాలా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆప్ అభ్యర్థి హరీందర్ సింగ్ ధాలివాల్ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ సింగ్ ధిల్లాన్ పై 634 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. బీజేపీ అభ్యర్థి కేవల్ ధిల్లాన్ మూడో స్థానంలో ఉన్నారు. కాగా, గిద్దర్ బాహా, డేరా బాబా నానక్, చబ్బేవాల్, బర్నాలా అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 20న ఉప ఎన్నికలు జరిగాయి. వీటి కౌంటింగ్ కొనసాగుతోంది.
కర్ణాటకలో అన్ని పార్టీలకు ఊరట!
కర్ణాటకలో జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ చెరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. సండూర్ సెగ్మెంట్ లో అధికార కాంగ్రెస్, షిగ్గావ్ లో బీజేపీ, చెన్నపట్నలో జేడీఎస్ ముందంజలో ఉంది. ఈ మూడు పార్టీలు తమ సిట్టింగ్ సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తున్నాయి.
కాంగ్రెస్ నేత తుకారాం, కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, జేడీఎస్ అగ్రనేత హెచ్ డీ కుమారస్వామి ఎంపీలుగా గెలుపొందడం వల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో చెన్నపట్నలో కుమార స్వామి తనయుడు నిఖిల్ కుమార్ స్వామి ఆధిక్యంలో ఉండగా, షిగ్గావ్ లో బసవరాజ్ బొమ్మై కుమారుడు భరత్ బొమ్మై, సండూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి అన్నపూర్ణాదేవీ ముందంజలో ఉన్నారు.
కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితాలు శనివారం వెల్లడవుతున్నాయి. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ ఫలితాల్లో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం 60వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
వయనాడ్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌పై 46,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రియాంకకు భారీ ఆధిక్యం ఖాయమనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
కాగా, వయనాడ్ ఎంపీ పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడం వల్ల ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో యూడీఎఫ్ కూటమి తరఫున ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. అలాగే బీజేపీ తరఫున నవ్య హరిదాస్, సీపీఐ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ తరఫున సత్యన్ మొకేరి బరిలో నిలిచారు. నవంబరు 13న పోలింగ్ జరిగింది.