వచ్చే ఏడాది ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది టీమిండియా. ఇందులో భారత్.. 2 డే/నైట్ టెస్టులు ఆడే ప్రతిపాదనపై ఆస్ట్రేలియా క్రికెట్(సీఏ) తనను సంప్రదించలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ చెప్పాడు. 4 టెస్టుల సిరీస్లో 2 డే/నైట్ టెస్టులు ఆడటం వీలు కానిదని అన్నాడు.
టీమిండియా.. ఆస్ట్రేలియాలో ఒకే సిరీస్లో 2 డే/నైట్ టెస్టులు ఆడటంపై ఏ నిర్ణయం తీసుకోలేదు. పింక్బాల్తో 2 డే/నైట్ టెస్టులు ఆడటం వీలుపడదు. ఈ విషయం గురించి పత్రికలో చదివాను. కానీ ఆస్ట్రేలియా నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదు. ఒకవేళ వస్తే ఆలోచిస్తాం.సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
గంగూలీ వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఛైర్మన్ ఎర్ల్ ఎడ్డింగ్స్ స్పందించాడు. 2020-21 పర్యటనలో భారత్ 2 డే/నైట్ టెస్టులు ఆడేందుకు బీసీసీఐకి ప్రదిపాదన పంపుతామని చెప్పాడు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్- భారత్ మధ్య జరిగిన పింక్ బంతి మ్యాచ్కు ఇంతమంది జనం వస్తారని ఊహించలేదన్నాడు గంగూలీ. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి బలమైన జట్లతో టెస్టు మ్యాట్ అంటే చాలా ఉత్సాహం వస్తుందని చెప్పాడు.
ఇదీ చూడండి: 'దిశ'ఎన్కౌంటర్కు ఓ యజమాని ఫిదా.. రూ.5 లక్షలు విరాళం