ETV Bharat / sports

యువ ఆటగాళ్లకు రోహిత్ క్రికెట్ పాఠాలు - రోహిత్ శర్మ లేటెస్ట్​ న్యూస్

Cricket Lessons Rohit Sharma: గాయం కారణంగా బెంగళూరులోని నేషనల్​ క్రికెట్ అకాడమీ(ఎన్​సీఏ)కి వెళ్లాడు టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్​ శర్మ.ఈ క్రమంలో అక్కడ శిక్షణ తీసుకుంటున్న అండర్-19 ఆటగాళ్లను కలిశాడు హిట్​ మ్యాన్​. వారికి క్రికెట్​ పాఠాలు బోధించాడు.

Cricket Lessons Rohit Sharma
రోహిత్ శర్మ
author img

By

Published : Dec 17, 2021, 10:13 PM IST

Cricket Lessons Rohit Sharma: గాయాల కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు టీమ్​ ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ. తిరిగి ఫిట్​నెస్ పొందేందుకు బెంగళూరులోని నేషనల్​ క్రికెట్ అకాడమీ(ఎన్​సీఏ)కి వెళ్లాడు.

Cricket Lessons Rohit Sharma
రోహిత్​ శర్మను సలహాలు అడిగి తెలుసుకుంటున్న క్రికెటర్

ఈ క్రమంలో అక్కడ శిక్షణ పొందుతున్న అండర్-19 ఆటగాళ్లను కలిశాడు హిట్​ మ్యాన్​. వారికి క్రికెట్ పాఠాలు చెప్పాడు. వారితో అనేక విషయాలు పంచుకున్నాడు.

ఆసియా కప్ నేపథ్యంలో..

Asia Cup 2021 Cricket: ఈ నెల 23 నుంచి యూఏఈలో ఆసియా కప్​ జరగనున్న నేపథ్యంలో అండర్-19 క్రికెటర్​లకు విలువైన సలహాలు ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ పాఠాలు వెలకట్టలేనివని ట్వీట్​ చేసింది. అయితే రోహిత్.. గాయం నుంచి కోలుకోవడానికి నాలుగు వారాలు పట్టొచ్చని వైద్య బృందం పేర్కొంది. అయితే.. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్​కు రోహిత్​ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

Cricket Lessons Rohit Sharma
కార్యక్రమంలో రోహిత్ శర్మ
Cricket Lessons Rohit Sharma
కుర్రాళ్లకు సలహాలు ఇస్తున్న రోహిత్

ఇక ఆల్ రౌండర్ జడేజా కూడా గాయం కారణంగా ప్రస్తుతం ఎన్​సీఏలోనే ఉన్నాడు. జడేజా కోలుకోవడానికి ఎక్కువ సమయమే పట్టొచ్చని సమాచారం.

ఇదీ చూడండి: దక్షిణాఫ్రికాకు టీమ్​ఇండియా.. ఎన్​సీఏలో రోహిత్, జడ్డూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.