న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ కోరె అండర్సన్ ఓ ఇంటివాడయ్యాడు. ఎన్నో ఏళ్లుగా తాను ప్రేమిస్తున్న మేరీ మార్గరెట్(Corey Anderson wife)తో అండర్సన్ వివాహం జరిగింది. పెళ్లి వేడుకలకు సంబంధించిన వివరాలు, విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు 30ఏళ్ల మాజీ ఆల్‌రౌండర్.
వెడ్డింగ్ లొకేషన్ హైలైట్‌గా నిలిచింది. అత్యంత సుందరంగా దీనిని తీర్చిదిద్దారు. తెల్ల పూలతో ప్రాంతాన్ని మరింత అందంగా మలిచారు.
29ఏళ్లకే రిటైర్మెంట్..
కివీస్ తరఫున మొత్తం 13 టెస్టులు ఆడిన అండర్సన్.. 29ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించాడు. 32.52 సగటుతో 683 పరుగులు చేశాడు. 49 వన్డేలకు ప్రాతినిధ్యం వహించగా 1109 పరుగులు సాధించాడు. ఆడిన 31 టీ20ల్లో 485 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ(2013లో వెస్టిండీస్‌పై) చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు అండర్సన్(Corey Anderson fastest century). ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఆడాడు. తర్వాత ఫామ్ లేమి కారణంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. చివరి వన్డే 2017 జూన్‌లో బంగ్లాదేశ్‌పై, చివరి టీ20 2018లో పాకిస్థాన్‌పై ఆడాడు.
ఇదీ చూడండి:- ఇది నిజంగా సిగ్గుచేటు: విరాట్ కోహ్లీ