Cooch Beher Trophy Prakhar Chaturvedi : కర్ణాటక యంగ్ బ్యాటర్ ప్రఖర్ చతుర్వేది సరికొత్త చరిత్ర సృష్టించాడు. తన అసాధారణ బ్యాటింగ్‌తో క్వాడ్రాపుల్ సెంచరీ నమోదు చేశాడు. కూచ్ బెహర్ ట్రోఫీ ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. దేశవాళీ అండర్-19 స్థాయిలో నిర్వహించే నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఏకంగా 400కు పైగా పరుగులు సాధించాడు. మొత్తం 638 బంతులు ఆడిన ప్రఖర్ చతుర్వేది 46 ఫోర్లు, 3 సిక్స్‌లు బాది 404 రన్స్ చేశాడు. ప్రఖర్ చతుర్వేది క్వాడ్రాపుల్ సెంచరీ ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అతడిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కాగా, కూచ్ బెహర్ ట్రోఫీ 2023-24 ఫైనల్లో ముంబయి - కర్ణాటక జట్లు తలపడ్డాయి. కేఎస్‌సీఏ నవులే స్టేడియం వేదికగా జనవరి 12న ఈ మ్యాచ్ మొదలైంది. ఈ పోరులో ముందుగా టాస్ గెలిచిన కర్ణాటక జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబైని 113.5 ఓవర్లో 384 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆయూష్(145) శతకంతో రాణించగా సచిన్ వర్తక్(73) అర్ధ శతకంతో సత్తా చాటాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక జట్టులో ప్రఖర్ చతుర్వేది(Prakhar Chaturvedi karnataka) క్వాడ్రాపుల్ సెంచరీ చేశాడు. హర్షిల్ ధర్మానీ (169), కార్తికేయ (72), కార్తిక్ (50), సమర్థ్లు(55 నాటౌట్) రాణించారు. దీంతో కర్ణాటక జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌ను 223 ఓవర్లలో 8 వికెట్లకు 890 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అలా కర్ణాటకకు 510 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ఆఖరి రోజు కర్ణాటక డిక్లేర్ ఇవ్వడం, ఫలితం తేలే అవకాశం లేకపోవడం వల్ల ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దాంతో టోర్నీ నిబంధనల ప్రకారం మొదటి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సంపాదించుకున్న కర్ణాటకను విజేతగా అనౌన్స్ చేశారు. అలా ఆ జట్టు కూచ్ బెహార్ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
-
"Karnataka's Prakhar Chaturvedi becomes the first player to score 400 in the final of #CoochBehar Trophy with his splendid 404* knock against Mumbai," posts @BCCIdomestic. pic.twitter.com/q9xlxafHON
— Press Trust of India (@PTI_News) January 15, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">"Karnataka's Prakhar Chaturvedi becomes the first player to score 400 in the final of #CoochBehar Trophy with his splendid 404* knock against Mumbai," posts @BCCIdomestic. pic.twitter.com/q9xlxafHON
— Press Trust of India (@PTI_News) January 15, 2024"Karnataka's Prakhar Chaturvedi becomes the first player to score 400 in the final of #CoochBehar Trophy with his splendid 404* knock against Mumbai," posts @BCCIdomestic. pic.twitter.com/q9xlxafHON
— Press Trust of India (@PTI_News) January 15, 2024
అప్పుడు రష్మిక, ఇప్పుడు సచిన్- డీప్‌ఫేక్‌తో బెట్టింగ్ మోసం!
ఫ్లాష్‌బ్యాక్ గుర్తుచేసిన విరాట్- స్ట్రయిట్ డ్రైవ్‌లో కోహ్లీయే 'కింగ్'