ETV Bharat / sports

24 ఏళ్ల తర్వాత కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో క్రికెట్‌.. తొలి మ్యాచ్‌ ఎప్పుడంటే? - కామన్‌వెల్త్‌ గేమ్స్‌ క్రికెట్

Commonwealth Games 2022 Cricket: 24 ఏళ్ల తర్వాత కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కింది. అయితే ఈసారి మహిళల జట్లు మాత్రమే పోటీపడనున్నాయి. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా జులై 28 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఈ గేమ్స్ జరగనున్నాయి.

womens cricket
క్రికెట్‌
author img

By

Published : Feb 2, 2022, 5:48 AM IST

Commonwealth Games 2022 Cricket: దాదాపు 24 ఏళ్ల తర్వాత కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కింది. కౌలాలంపూర్‌లో (1998) జరిగిన ఆ క్రీడల తర్వాత ఇప్పుడు మరోసారి క్రికెట్‌ను చూసే అవకాశం వచ్చింది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా జులై 28 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు జరుగుతాయి. అయితే ఈసారి మహిళల జట్లు మాత్రమే పోటీపడనున్నాయి.

ఈ మేరకు టీ20 టోర్నమెంట్‌లో పాల్గొనబోయే జట్లను ఐసీసీ, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (సీజీఎఫ్‌) సంయుక్తంగా ప్రకటించాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, బార్బడోస్, ఇంగ్లాండ్, భారత్‌, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ క్వాలిఫై సాధించగా.. తాజాగా శ్రీలంక అర్హత సాధించినట్లు ఐసీసీ తెలిపింది.

ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జెఫ్‌ అలార్డైస్ మాట్లాడుతూ.. "చాలా రోజుల తర్వాత కామన్‌వెల్త్‌ గేమ్స్‌ కోసం తుది జట్లను ఖరారు చేయడం బాగుంది. బంగారు పతకం కోసం ఎనిమిది జట్లు పోటాపోటీగా తలపడతాయని ఆశిస్తున్నా. మహిళల క్రికెట్‌ క్యాలెండర్‌ ఇయర్‌లో సీడబ్ల్యూజీ ముఖ్య భూమిక పోషిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు క్రికెట్‌ను మరింత దగ్గర చేరువ చేస్తాం" అని వివరించారు.

"క్రికెట్ అనేది కామన్‌వెల్త్‌కు పర్యాయపదంగా ఉండేది. కౌలాలంపూర్‌లో 1998లో వన్డే టోర్నీ తర్వాత మళ్లీ ఇప్పుడు క్రికెట్ వచ్చినందుకు సంతోషంగా ఉంది" అని సీజీఎఫ్‌ అధ్యక్షుడు డేమ్ లూయిస్ మార్టిన్‌ వెల్లడించారు. మహిళల టీ20 క్రికెట్ అరంగేట్రం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.

మహిళల క్రికెట్ తొలిసారి ఆడుతున్న నేపథ్యంలో ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా ఐసీసీ విభజించింది. ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్‌ జట్లు తలపడటం ఆసక్తిగా ఉండనుంది. ఈ రెండు జట్లతోపాటు ఆస్ట్రేలియా, బార్బడోస్‌ ఇదే గ్రూప్‌లో ఉన్నాయి. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక గ్రూప్‌-బిలో పోటీ పడనున్నాయి. మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనలిస్టులు అయిన ఆస్ట్రేలియా, భారత్‌ జులై 29న తలపడే మ్యాచ్‌తో నాకౌట్‌ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది.

మొదటిసారి 1998లో కౌలాలంపూర్‌ వేదికగా జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పురుషుల క్రికెట్ వన్డే టోర్నమెంట్ జరిగింది. మొత్తం పదహారు జట్లు నాలుగు గ్రూప్‌లుగా విడిపోయాయి. అయితే టీమ్ఇండియా కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించి గ్రూప్‌ స్టేజ్‌కే పరిమితమైంది. షాన్‌ పొలాక్‌ నాయకత్వం వహించిన దక్షిణాఫ్రికా గోల్డ్‌ మెడల్‌ను సాధించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో స్టీవ్‌ వా నేతృత్వంలోని ఆస్ట్రేలియాను చిత్తు చేసి మరీ విజేతగా నిలిచింది.

ఈ టోర్నమెంట్‌ ద్వారానే సచిన్‌ తెందూల్కర్, జాక్వెస్‌ కలిస్, మహేల జయవర్థనె వంటి ఆటగాళ్లు హాల్ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: బరాత్​లో కారుపైకి ఎక్కి స్టెప్పులేసిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.