Case Filed Against Sreesanth : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌పై కేరళలో కేసు నమోదైంది. కన్నూర్ జిల్లాకు చెందిన సరీశ్ గోపాలన్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు.. పోలీసులు శ్రీశాంత్ సహా మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. అసలేం ఏమైందంటే?
ఇదీ జరిగింది... కర్ణాటక కొల్లూర్‌లో స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణం పేరిట.. 2019 నుంచి ఆయా తేదీల్లో రాజీవ్ కుమార్, వెంకటేశ్ అనే ఇద్దరు వ్యక్తులు తన దగ్గర రూ. 18.70 లక్షలు తీసుకున్నట్లు గోపాలన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రికెటర్ శ్రీశాంత్ పార్ట్నర్గా ఉన్న అదే అకాడమీలో భాగస్వామిగా అవకాశం రావడం వల్ల.. తాను ఈ డబ్బును పెట్టుబడిగా పెట్టినట్లు గోపాలన్ ఫిర్యాదులో తెలిపారు. దీంతో పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 420 కింద శ్రీశాంత్‌ను మూడో నిందితుడిగా చేర్చారు.
-
Cricketer S Sreesanth booked in cheating case in Kerala
— ANI Digital (@ani_digital) November 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/7aZwsp4Cck#Kerala #SSreesanth #keralapolice pic.twitter.com/IUgXfsfMju
">Cricketer S Sreesanth booked in cheating case in Kerala
— ANI Digital (@ani_digital) November 24, 2023
Read @ANI Story | https://t.co/7aZwsp4Cck#Kerala #SSreesanth #keralapolice pic.twitter.com/IUgXfsfMjuCricketer S Sreesanth booked in cheating case in Kerala
— ANI Digital (@ani_digital) November 24, 2023
Read @ANI Story | https://t.co/7aZwsp4Cck#Kerala #SSreesanth #keralapolice pic.twitter.com/IUgXfsfMju
2013లోనే బ్యాన్..
40 ఏళ్ల పేస్ బౌలర్ శ్రీశాంత్.. 2013 ఐపీఎల్లో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీంతో అతడితో సహా అజిత్ చండీలా, అంకిత్ చవాన్ అనే మరో ఇద్దరిపై బీసీసీఐ జీవిత కాలంపాటు నిషేధం విధించింది. కానీ, ఈ నిషేధాన్ని 2019లో సుప్రీం కోర్టు 7 ఏళ్లకు తగ్గించింది. దీంతో అతడిపై బ్యాన్ 2020లో ముగిసింది. ఇక నిషేధం ముగిసిన తర్వాత శ్రీశాంత్ మళ్లీ.. మైదానంలో దిగాడు. అతడు 2021లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది జరిగిన ఐపీఎల్లో కామెంటర్‌గానూ వ్యవహరించాడు.
వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌మెంబర్.. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీశాంత్ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఫైనల్ మ్యాచ్‌లో జట్టులో చోటు దక్కించుకున్న శ్రీశాంత్ 8 ఓవర్లలో వికెట్ లేకుండా 52 పరుగులు సమర్పించుకున్నాడు.
రిటైర్మెంట్ ప్రకటన.. గతేడాది మార్చిలో శ్రీశాంత్.. ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్లో శ్రీశాంత్ 27 టెస్టు, 53 వన్డే, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి అతడు 169 వికెట్లు పడగొట్టాడు.
సినిమాల్లో ఎంట్రీ.. క్రికెట్‌కు దూరంగా ఉన్న సమయంలో శ్రీశాంత్.. యాక్టింగ్‌పై దృష్టి పెట్టాడు. హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించాడు.
10 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి శ్రీశాంత్ రీఎంట్రీ.. కానీ ఆడేందుకు కాదు..