'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'.. ప్రతీమ్యాచ్ తర్వాత ఓ ఆటగాడి అత్యుత్తమ ప్రదర్శనను గుర్తిస్తూ ఇచ్చే అవార్డు. ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు.. లేక ఎక్కువ వికెట్లు తీసిన లేదా క్యాచ్‌లు పట్టినవారికి ఈ అవార్డు సొంతమవుతుంది. అయితే క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఇవేవీ లేకపోయినా ఓ ఆటగాడిని 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' వరించింది. 2001లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
అది 2001లో విండీస్, జింబాబ్వే మధ్య జరిగిన వన్డే మ్యాచ్. విండీస్ బౌలర్ కెమెరాన్ కఫ్ఫీ.. 10 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ తీయలేకపోయాడు. అయితే ఆ 10 ఓవర్లలో అతను కేవలం 20 పరుగులే ఇచ్చాడు. అంతేకాదు.. వీటిలో రెండు మెయిడెన్ ఓవర్లు కూడా ఉన్నాయి. మొత్తం మ్యాచ్‌లో అతని బౌలింగ్ ఎకానమీ 2.00గా నమోదైంది. దీంతో అద్భుతమైన బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేసినందుకుగాను అతడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ప్రస్తుతం విండీస్ సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడుతోంది. గురువారం తొలి మ్యాచ్ ప్రారంభం కాగా.. 24న రెండో టెస్టు, జూలై 2న మూడో టెస్టు జరగనుంది.
ఇదీ చూడండి : ఇంగ్లాండ్‌కు టీమ్ఇండియా.. ఆఖరి టెస్టులో కొత్త కెప్టెన్లతో బరిలోకి