భారత్ నుంచి విమాన రాకపోకలను ఆస్ట్రేలియా ప్రభుత్వం నిలుపుదల చేసిన నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు స్పందించింది. బీసీసీఐతో పాటు ఐపీఎల్ నిర్వాహకులతో వరుసగా చర్చలు జరుపుతామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తామని తెలిపింది. ఆసీస్ ఆటగాళ్లకు సహాయం చేయడానికి మోరిస్ ప్రభుత్వంతో సంబంధాలు పెంచుకుంటామని హామీ ఇచ్చింది.
ఇదీ చదవండి: 'మీరు సజావుగా వెళ్లాకే.. లీగ్ ముగిసినట్లు భావిస్తాం'
"ఇప్పటి నుంచి ఆటగాళ్లు, కోచ్‌లు, మ్యాచ్ నిపుణులు, వ్యాఖ్యాతలతో ఎప్పటికప్పుడు చర్చలు జరపాలని క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ నిర్ణయించాయి. అవసరమైన చోట సాయం చేయడానికి కూడా మేం సిద్ధమే. మే 15 వరకు భారత్ నుంచి రాకపోకలు నిలుపుదల చేయాలని ప్రధాని మోరిసన్ నిర్ణయించారు. లీగ్ చివరి తేదీయైనా మే 30 వరకు పరిస్థితులను పర్యవేక్షిస్తాం. మీకు సాయం చేయడానికి ప్రభుత్వంతో సంబంధాలు పెంచుకుంటాం."
-క్రికెట్ ఆస్ట్రేలియా.
ఇదీ చదవండి: 'ప్రత్యేక ఏర్పాట్లు చేయండి- అదేం కుదరదు'
బీసీసీఐకి ధన్యవాదాలు..
"భారత్‌లో కరోనా విధ్వంసం సృష్టిస్తున్నా.. బీసీసీఐ అత్యంత భద్రత ప్రమాణాల నడుమ లీగ్‌ను నిర్వహిస్తోంది. ఆటగాళ్లను సురక్షితమైన బయో బబుల్‌లో ఉంచుతోంది. అందుకుగానూ భారత క్రికెట్ బోర్డుతో పాటు ఐపీఎల్ నిర్వాహకులకు ధన్యవాదాలు" అని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.
ఇదీ చదవండి: బ్రెట్ లీ దాతృత్వం- భారత్‌కు బిట్‌కాయిన్ సాయం