ETV Bharat / sports

'అలా చేస్తే బుమ్రా పని ఖతం.. జాగ్రత్త పడాల్సిందే' - Team India Bumrah

టీమ్ఇండియా స్టార్​ బౌలర్​ జస్ప్రిత్​ బుమ్రా ఎక్కువ కాలం క్రికెట్​లో ఉండాలంటే అతడిని ప్రతి మ్యాచ్​లోనూ ఆడించకూడదని అభిప్రాయపడ్డాడు పాక్​ మాజీ బౌలర్​ షోయబ్​ అక్తర్. బుమ్రా బౌలింగ్​ యాక్షన్​తో అతడికి గాయాలు అయ్యే అవకాశాలు ఎక్కువని తెలిపాడు.

Bumrah
బుమ్రా
author img

By

Published : Jul 29, 2021, 5:31 PM IST

భారత క్రికెట్​కు జస్ప్రిత్​ బుమ్రా ఓ ఆయుధం​. అటు ఐపీఎల్​ అయినా, ఇటు అంతర్జాతీయ మ్యాచ్​లలోనైనా.. డెత్ ఓవర్లలో సారథులు బంతి అందించేది బుమ్రాకే! తన పదునైన బౌలింగ్​తో కెరీర్​ ఆరంభం నుంచి దూసుకుపోతున్నాడు బుమ్రా. ముఖ్యంగా తన బౌలింగ్​ యాక్షన్​తో ఎందరినో ఆకట్టుకున్నాడు. కానీ అదే బౌలింగ్​ యాక్షన్​తో బుమ్రా కెరీర్​కే ప్రమాదం అంటున్నాడు పాకిస్థాన్​ మాజీ బౌలర్​ షోయబ్​ అక్తర్​. బుమ్రా బౌలింగ్​ యాక్షన్​తో గాయాలయ్యే అవకాశాలు ఎక్కువని చెబుతున్నాడు.

"ఫ్రంట్ యాక్షన్​పైనే బుమ్రా బౌలింగ్​ ఆధారపడి ఉంటుంది. వెన్ను, భుజం వేగమే ఇక్కడ కీలకం. సాధారణ బౌలింగ్​లో కొంచెం పక్కకి ఒంగితే కొంత ఉపశమనం లభిస్తుంది. కానీ ఫ్రంట్ యాక్షన్​లో ఇలా ఉండదు. ఎంత ప్రయత్నించినా, వెన్ను నొప్పి నుంచి తప్పించుకోలేరు. షేన్​ బాండ్​, ఇయాన్​ బిషప్​లు ఇందుకు ఉదాహరణ. అందుకే బుమ్రా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 'ఒక మ్యాచ్​ ఆడాను. ఇక విశ్రాంతి తీసుకోవాలి' అన్నట్టు బుమ్రా ఉండాలి. పని భారాన్ని తగ్గించుకోవాలి. అలా కాకుండా ప్రతి మ్యాచ్​లోనూ ఆడిస్తే ఇంకో ఏడాదిలో బుమ్రా పని అయిపోతుంది.'"

- షోయబ్​ అక్తర్​, పాక్​ మాజీ బౌలర్​.

ప్రతి ఐదు అంతర్జాతీయ మ్యాచ్​లలో మూడింట్లోనే బుమ్రాను ఆడించాలని అభిప్రాయపడ్డాడు అక్తర్​. బుమ్రా ఎక్కువ కాలం క్రికెట్​లో కొనసాగాలంటే ఇలా చేయడం తప్పదు అని స్పష్టం చేశాడు.

ఇదీ చూడండి:- బుమ్రా బౌలింగ్​ సీక్రెట్​పై ఐసీసీ వీడియో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.