ETV Bharat / sports

Brothers In Indian Cricket : టీమ్ఇండియాలో 'బ్రో'మాన్స్.. పఠాన్- పాండ్య సోదరుల తర్వాత వీరి ఎంట్రీ పక్కా! - pathan brothers in indian team

Brothers In Indian Cricket : కొన్నేళ్ల కిందట స్టార్ ఆల్​రౌండర్​లు పఠాన్ బ్రదర్స్.. టీమ్ఇండియాకు అనేక విజయాలు కట్టబెట్టిన విషయం తెలిసిందే. వీరి తర్వాత ఇప్పుడు బ్రదర్స్ అనగానే.. పాండ్య సోదరుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే మరి కొంతకాలం వీరు టీమ్ఇండియాతో కొనసాగడం ఖాయం. మరి వీరి తర్వాత టీమ్​ఇండియాలో ఎంట్రీ ఫిక్స్​ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మరో సోదర ద్వయం గురించి తెలుసుకుందాం రండి.

Brothers In Indian Cricket
Brothers In Indian Cricket
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 10:28 PM IST

Brothers In Indian Cricket : క్రికెట్​ ప్రపంచంలో అన్నాదమ్ముళ్లిద్దరూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అనేది గొప్ప విషయం. అలా ఒకప్పుడు యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ సోదరుల ద్వయం టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించింది. యూసఫ్, ఇర్ఫాన్.. వారి టాలెంట్​, స్కిల్స్​తో ఎందరో మంది అభిమానులను సంపాదించుకున్నారు. వీరిద్దరూ టీమ్ఇండియాకు అనేక విజయాలు కట్టబెట్టారు కూడా.

వీరి రిటైర్మెంట్​ తర్వాత అంతటి ఉత్తమమైన ఆల్​రౌండర్లుగా.. హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య సోదరులు టీమ్ఇండియాలో ఎంట్రీ ఇచ్చారు. వీరిలో కృనాల్ అప్పుడప్పుడు జట్టుకు ఎంపిక కాగా.. హార్దిక్ ఏకంగా టీ20ల్లో కెప్టెన్​గా ఎప్పుడో ప్రమోషన్ పొందాడు. ఇక వీరిద్దరి తర్వాత టీమ్ఇండియాలో మరో సోదరుల ద్వయం ఎంట్రీ ఇస్తుందా? అన్న ప్రశ్న అభిమానుల్లో రేకెత్తుతోంది. అయితే ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన అజయ్, విజయ్ అనే సోదరులు.. వారి అద్భుత ఆటతీరుతో స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మరి వారి కథేంటో తెలుసుకుందాం.

ఉత్తర్​ప్రదేశ్​ సహరన్​పుర్​కు చెందిన అజయ్, విజయ్​లు కవలలు. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం కలిగిన ఈ సోదరులు క్రీడలపై మక్కువతో క్రికెట్​ను ఎంచుకున్నారు. వీరు మేరఠ్​లోని భమాషా స్టేడియంలో రోజు సాధన చేస్తుండేవారు. ఇక స్థానికంగా అనేక టోర్నమెంట్​లలో అద్భుతంగా రాణించి.. యూపీ టీ20 లీగ్​లో ఆడే ఛాన్స్​ కొట్టేశారు. వీరిద్దరూ ఈ లీగ్​లో వేర్వేరు జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించారు.

సోదరులు అజయ్, విజయ్
సోదరులు అజయ్, విజయ్

'భువనేశ్వర్ స్ఫూర్తి'.. టీమ్ఇండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తనకు స్ఫూర్తి అని అజయ్ ఈటీవీ భారత్​తో తెలిపాడు. "మాకు భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్య స్ఫూర్తి. మేమిద్దరం 2018లో మేరఠ్ భమాషా స్టేడియానికి వచ్చి ట్రైనింగ్ తీసుకునేవాళ్లం. ఈ సమయంలోనే సీనియర్​ క్యాంప్​ అండర్ 19లో ఆడాను. ఆ తర్వాత అనేక జాతీయ స్థాయి టోర్నీల్లోనూ పాల్గొన్నా. ఇంతటితో ఆగిపోను. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఇలా ఒక్కొ మెట్టు ఎక్కుకుంటూ టీమ్ఇండియాలో చోటు దక్కించుకోవడమే నా లక్ష్యం" అని అజయ్ అన్నాడు.

ప్రాక్టీస్​లో సోదరులు అజయ్, విజయ్
ప్రాక్టీస్​లో సోదరులు అజయ్, విజయ్

భువనేశ్వర్ కోచ్​ దగ్గరే శిక్షణ.. స్వింగ్​ కింగ్​ భువనేశ్వర్ కోచ్ సంజయ్ రస్తోగి వద్ద నాలుగేళ్లుగా ఈ సోదరులు శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. గతేడాది స్టేట్ అండర్ 19లో 25 మ్యాచ్​లు ఆడిన విజయ్.. రీసెంట్​గా జరిగిన​ యూపీ టీ20 లీగ్​లో గోరఖ్​పుర్ జట్టు తరఫున 5 మ్యాచ్​లు ఆడాడు. ఐదింట్లో కలిపి 6 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇక ఈ సోదరులిద్దరూ ఎంతో ప్రతిభావంతులని కోచ్ రస్తోగి కితాబిచ్చాడు. రానున్న రోజుల్లో ఈ సోదరులు భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని స్థానికులు అంటున్నారు.

చిందేసిన పాండ్యా బ్రదర్స్‌.. వీడియో వైరల్​

టీమ్ఇండియాలో బ్రొమాన్స్.. అమర్​నాథ్​​ టూ పాండ్యాస్!​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.