ETV Bharat / sports

'బాక్సింగ్ డే టెస్టు'.. ఈ పేరెలా వచ్చిందో తెలుసా? - ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ బాక్సింగ్ డే టెస్టు

ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ 'బాక్సింగ్ డే' టెస్టుల్లో తలపడనున్నాయి. అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఎప్పటినుంచి పిలుస్తున్నారు? భారత్​ ఎన్నిసార్లు 'బాక్సింగ్ డే' మ్యాచ్​ ఆడింది? అనే విషయాలూ చూద్దాం.

Boxing Day Test history, Boxing Day Test latest news, బాక్సింగ్ డే టెస్టు చరిత్ర, బాక్సింగ్ డే టెస్టు లేటెస్ట్ న్యూస్
Boxing Day Test
author img

By

Published : Dec 26, 2021, 9:27 AM IST

సెంచూరియన్ వేదికగా ఆదివారం ప్రారంభమయ్యే భారత్​-దక్షిణాఫ్రికా 'బాక్సింగ్​ డే' టెస్టు కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్​ను బాక్సింగ్ డే టెస్టు అని ఎందుకు పిలుస్తారు? దాని వెనుకున్న కథేంటి? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

అలా వచ్చిందా పేరు..

డిసెంబర్​ 26కు, బాక్సింగ్​ క్రీడకూ ఏ సంబంధమూ లేదు. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాల్లో క్రిస్మస్​ తర్వాతి రోజున అందరూ తమ బంధవులను, స్నేహితులను కలిసి బహుమతుల బాక్సులను అందజేస్తారు. పండగ ముగిసిన తర్వాత రోజు అంటే డిసెంబరు 26న తమ వద్ద పనిచేసే వారందరికి యజమానులు సెలవు ఇచ్చి, వారికి కానుకలను అందజేస్తారు. అలా క్రిస్మస్​ ముగిసిన తర్వాతి రోజున కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతూ.. వారికి వచ్చిన బహుమతి బాక్సులను పరిశీలిస్తారు. అలా ఆ రోజును 'బాక్సింగ్​ డే'గా పిలవడం ప్రారంభించారు.

ఇదీ చరిత్ర..

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ మధ్య మొదటిసారి 1950లో బాక్సింగ్​ డే టెస్టు జరిగింది. ఈ మ్యాచ్​లో 28 పరుగుల తేడాతో ఆసీస్​ విజయం సాధించింది. ఆ తర్వాత కూడా వివిధ దేశాలతో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్ బాక్సింగ్ డే టెస్టుల్లో ఆడాయి.

వాటిని కూడా అదే పేరుతో..

'బాక్సింగ్​ డే' టెస్టు కేవలం దక్షిణాఫ్రికాకు మాత్రమే పరిమితం కాలేదు. న్యూజిలాండ్​, ఆస్ట్రేలియాల్లోనూ ఈ మ్యాచ్​లను అదే పేరుతో నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియా​-ఇంగ్లాండ్​ మధ్య ఆదివారం నుంచి మొదలుకానున్న యాషెస్ మూడో టెస్టు​నూ బాక్సింగ్​ డే టెస్టుగానే పిలుస్తున్నారు.

ఇవీ చూడండి: దక్షిణాఫ్రికా పర్యటన.. ద్రవిడ్​కు అగ్నిపరీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.