బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఆసీస్ చేతులెత్తేసిన పిచ్‌పై భారత బ్యాటర్లు విజృంభించారు. 321/7తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌లో.. అక్షర్, షమీ దూకుడుగా ఆడటంతో మరో 79 పరుగులు జోడించి.. 400 భారీ స్కోరుతో ఆలౌట్ అయింది. దీంతో 223 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రోహిత్ శర్మ (120; 212 బంతుల్లో 15x4, 2x6) కెప్టెన్‌గా తొలి టెస్టు శతకానికి తోడు.. ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్ (84), రవీంద్ర జడేజా (70) రాణించారు. అక్షర్ సెంచరీకి చేరువగా వచ్చి దాన్ని మిస్ అయ్యాడు. ఈ స్కోరుతో అతడు తన టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఇక చివర్లో షమీ (37) దూకుడుగా ఆడాడు.
కాగా, ఆసీస్ బౌలర్లలో యువ స్పిన్నర్ మర్ఫీ చెలరేగాడు. తన మాయాజాలంతో మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఔట్ చేయడం ద్వారా తొలి వికెట్ తీసిన మర్ఫీ.. అశ్విన్, పుజారా, కోహ్లీ, జడేజా, శ్రీకర్ భరత్.. ఆఖర్లో షమీని పెవిలియన్‌కు పంపాడు. తద్వారా తన కెరీర్‌లో ఈ టెస్టును మధుర జ్ఞాపకంగా మలచుకున్నాడు. ఇంకా పాట్ కమిన్స్ 2, లైయన్ ఒక వికెట్ తీశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 177 పరుగులకే కుప్పకూలింది.
ఇదీ చూడండి: WPL 2023: వేలంలో ఈ ప్లేయర్స్ వెరీ స్పెషల్.. మరి కాస్ట్లీగా నిలుస్తారా?