ETV Bharat / sports

IND vs AUS: మూడో టెస్టు వేదిక మార్పు.. ఇక అదే ఫైనల్.. బీసీసీఐ అధికార ప్రకటన - బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 2023

బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మార్చి 1 నుంచి ధర్మశాలలో జరగాల్సిన మూడో టెస్టును మరో చోటుకు తరలించనున్నట్లు బీసీసీఐ అధికార ప్రకటన చేసింది. విశాఖపట్నం లేదా బెంగళూరుకు మూడో టెస్టును తరలించే అవకాశముందని వార్తలను వస్తున్నాయి. అయితే ఆ వేదికలను కాకుండా మరో వేదిక పేరును తెలుపుతూ ప్రకటన చేసింది బోర్డు.

Border Gavaskar trophy IND VS AUS thrid test venue changed to Indore
IND vs AUS: మూడో టెస్టు వేదిక మార్పు​ ఫిక్స్​.. ఇక జరిగేది అక్కడే!
author img

By

Published : Feb 13, 2023, 10:13 AM IST

Updated : Feb 13, 2023, 11:49 AM IST

బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మార్చి 1 నుంచి ధర్మశాలలో జరగాల్సిన మూడో టెస్టును మరో చోటుకు తరలించనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నం లేదా బెంగళూరుకు మూడో టెస్టును తరలించే అవకాశముందని అన్నారు. బీసీసీఐ క్యురేటర్‌ తపోష్‌ ఛటర్జీ ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌పీసీఏ) స్టేడియం పిచ్‌, ఔట్‌ఫీల్డ్‌ను తనిఖీ చేసి బోర్డుకు నివేదిక అందించాడని కథనాలు వచ్చాయి. ఔట్‌ఫీల్డ్‌ సిద్ధంగా లేకపోవడమే అందుకు కారణమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పుడు ఈ విషయమై బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మూడో టెస్టును విశాఖపట్నం లేదా బెంగళూరుకు కాకుండా ఇందోర్​కు తరలించనున్నట్లు పేర్కొంది. హోల్కర్‌ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఔట్‌ఫీల్డ్‌ సిద్ధంగా లేకపోవడమే కారణమని స్పష్టం చేసింది. ఇకపోతే ఈ మ్యాచ్​ మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు జరగనుంది.

ఇక, సిరీస్‌ విషయానికొస్తే నాగ్‌పుర్‌లో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతోవిజయం సాధించింది. దిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి రెండో టెస్టు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో కూడా కంగారు జట్టును కంగుతినిపించాలని టీమ్ఇండియా భావిస్తోంది. తొలి టెస్టులో ఘోర ఓటమిపాలైన ఆసీస్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి పుంజుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే కొత్త స్పిన్నర్‌ మాట్‌ కుహ్నెమాన్‌ను జట్టులోకి తీసుకుంది.

ఇదీ చూడండి: Women's IPL 2023: వేలానికి వేళాయే.. ఈ ప్లేయర్స్​పైనే అందరి ఫోకస్​!

Last Updated : Feb 13, 2023, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.