Encounter In Uttar Pradesh : ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులను మృతి చెందగా, ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. సోమవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరగ్గా, ఘటనాస్థలిలో రెండు ఏకే-47 రైఫిళ్లు, రెండు గ్లాక్ పిస్టల్స్, భారీగా మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 'ఖలిస్థాన్ జిందాబాద్' ఫోర్స్ టెర్రర్ మాడ్యూల్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Pilibhit, Uttar Pradesh | An encounter took place between a joint team of Uttar Pradesh Police and Punjab Police and three criminals who had thrown grenades at a police post in the Gurdaspur district of Punjab were injured. Later, the three criminals were declared dead. Two AK… pic.twitter.com/3aRCPKNUP5
— ANI (@ANI) December 23, 2024
ఈ ముగ్గురు ఉగ్రవాదులు ఇటీవల పంజాబ్‌లోని ఓ పోలీస్ పోస్ట్‌పై దాడికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. అనుమానాస్పద వస్తువులతో వారు పురానాపుర్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పంజాబ్ పోలీసుల నుంచి సమాచారం అందడం వల్ల ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పంజాబ్ పోలీసులతో కలిసి పురాన్‌పుర్‌లో జల్లెడ పట్టారు. ఈ క్రమంలో ఓ ద్విచక్రవాహనంపై ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు పారిపోతున్నట్టు గుర్తించారు. వారిని వెంబడించగా పురాన్‌పుర్ సమీపంలో ఓ నిర్మాణంలో ఉన్న వంతెన కిందకు వెళ్లారు. అన్ని వైపుల నుంచి పోలీసులు వారిని చుట్టుముట్టారు. పోలీసులను చూసి వారిపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు వారిపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.
ఎన్‌కౌంటర్‌లో హతమైన ఖలిస్థానీ ఉగ్రవాదులను పంజాబ్ గురుదాస్‌పుర్‌కు చెందిన గుర్విందర్ సింగ్ (25), వీరేందర్ సింగ్ అలియాస్ రవి (23), జస్ప్రీత్ సింగ్ అలియాస్ పర్తాప్ సింగ్ (18) గా పోలీసులు గుర్తించారు. పారిపోవడానికి వీరు ఉపయోగించిన ద్విచక్రవాహనం చోరీ చేసిందని చెప్పారు. ఎన్‌కౌంటర్‌పై పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. పంజాబ్‌లో ఐఎస్ఐఎస్ ప్రాయోజిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో పురోగతి సాధించినట్టు చెప్పారు. పాక్ ప్రాయోజిత "ఖలిస్థాన్ జిందాబాద్" ఫోర్స్ టెర్రర్ మాడ్యూల్ ఏరివేత కోసం యూపీ, పంజాబ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారని చెప్పారు. ఈ క్రమంలో పోలీసులపై నిందితులు కాల్పులు జరపడం వల్ల ఎదురుకాల్పులు జరిగినట్లు వివరించారు. ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగానూ తెలిపారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ టెర్రర్ మాడ్యూల్‌ను పాకిస్థాన్‌లో ఉన్న ఖలిస్థాన్ జిందాబాద్ చీఫ్ రంజిత్ సింగ్ నీతా నియంత్రిస్తున్నాడని తెలుస్తోంది. అతను ప్రధానంగా గ్రీస్‌లో ఉన్న జస్విందర్ సింగ్ మను ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని సమాచారం.
Uttar Pradesh DGP Prashant Kumar tweets " in a resolute step towards ensuring national security, up police, in collaboration with punjab police, successfully neutralized a pak-sponsored terror module of the khalistan zindabad force (kzf). the coordinated operation led to an… pic.twitter.com/L49CHpithH
— ANI (@ANI) December 23, 2024