ETV Bharat / sports

Russell: 'క్రికెట్​ కోసమే అవన్నీ భరిస్తున్నా' - ఆండ్రూ రసెల్​ బయోబబుల్​

బయోబబుల్​(Biobubble) వల్ల తన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నాడు వెస్టిండీస్​ ఆల్​రౌండర్​ ఆండ్రూ రసెల్(Russell)​. ఈ బుడగలో ఉండటం కష్టంగా ఉన్నప్పటికీ కేవలం క్రికెట్​ కోసమే దీన్ని భరిస్తున్నట్లు వెల్లడించాడు.

Russell
రసెల్
author img

By

Published : Jun 3, 2021, 9:13 PM IST

అదేపనిగా బయోబబుల్​లో(Biobubble) ఉండటం వల్ల తన మానసిక ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం పడుతుందని చెప్పాడు వెస్టిండీస్​ ఆల్​రౌండర్​ ఆండ్రూ రసెల్(Russell). ఇటీవల పీఎస్​ఎల్​ ఆడేందుకు దుబాయ్​ చేరుకున్న అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.

"కేవలం నా గురించే మాట్లాడుతున్నాను. బయోబబుల్​ నా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ బుడగ వల్ల నచ్చిన ప్రదేశానికి వెళ్లలేకపోతున్నాను. బయట నడిచేందుకు కూడా అవకాశం లేదు. అయినా ఇవ్వన్నీ తట్టుకోవడానికి కారణం.. ఈ బబుల్​లో నాకు ఇష్టమైన క్రికెట్​ ఆడటమే. దీన్ని నేను గొప్పగా భావిస్తూ.. నా విధులను నిర్వర్తిస్తున్నాను"

-రసెల్​, వెస్టిండీస్​ ఆల్​రౌండర్​

రసెల్​.. పీఎస్​ఎల్​లో క్వెటా గ్లాడియేటర్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్​లో(IPL) కోల్​కతా నైట్​ రైడర్స్​ తరఫున ఆడుతున్నాడు. వాయిదా పడ్డ ఈ మెగాలీగ్​ యుఏఈ వేదికగా సెప్టెంబరులో జరగనుంది.

ఇదీ చూడండి 'బుమ్రా బౌలింగ్​ టెక్నిక్​ అతడికే ప్రమాదం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.