Big Bash League Umpire : మెల్‌బోర్న్ వేదికగా బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా శనివారం సిడ్నీ సిక్సర్స్, మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో ఓ ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. దీన్ని చూసిన అభిమానులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఇమాద్ వసీమ్ వేసిన మూడో ఓవర్ 4వ బంతికి సిడ్నీ సిక్సర్స్ ప్లేయర్ జేమ్స్ విన్స్ నేరుగా బౌలర్‌ను కొట్టాడు. దీంతో బంతిని ఆపేందుకు వసీమ్ ప్రయత్నించగా అది కాస్త అతడ్ని తాకుతూ నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న స్టంప్స్‌ను పడగొట్టింది. దీంతో బౌలర్‌తో పాటు మెల్‌బోర్న్ ఫీల్డర్లు రనౌట్‌కు అప్పీల్ చేశారు. ఈ నేపథ్యంలో ఫీల్డ్ అంపైర్ కాస్త థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు.
రిప్లేలో కూడా బంతి స్టంప్స్‌ను తాకే సమయానికి బ్యాటర్ క్రీజులోకి వచ్చినట్లుగా స్పష్టంగా చూపించింది. దీంతో థర్డ్ అంపైర్ తుది నిర్ణయాన్ని వెల్లడించడానికి సిద్దమయ్యాడు. అయితే బిగ్‌స్క్రీన్‌లో మాత్రం అనూహ్యంగా ఔట్ కన్పించింది. దీంతో ఒక్కసారిగా ప్లేయర్లందరూ షాకయ్యారు. అయితే థర్డ్ అంపైర్ నాటౌట్ బటన్‌కు బదులుగా తప్పుడు బటన్ నొక్కాడు. దీంతో ఫలితాలు తారుమారయ్యాయి. అయితే నాటౌట్ తన తప్పిదాన్ని ఫీల్డ్ అంపైర్ ద్వారా తెలుసుకున్న థర్డ్ అంపైర్ సమాచారం అందించాడు. దీంతో వెంటనే థర్డ్ అంపైర్ నాటౌట్ బటన్ నొక్కి ఆ తప్పును సరి చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
-
He's pressed the wrong button! 🙈@KFCAustralia #BucketMoment #BBL13 pic.twitter.com/yxY1qfijuQ
— KFC Big Bash League (@BBL) January 6, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">He's pressed the wrong button! 🙈@KFCAustralia #BucketMoment #BBL13 pic.twitter.com/yxY1qfijuQ
— KFC Big Bash League (@BBL) January 6, 2024He's pressed the wrong button! 🙈@KFCAustralia #BucketMoment #BBL13 pic.twitter.com/yxY1qfijuQ
— KFC Big Bash League (@BBL) January 6, 2024
Sydney Sixers Vs Melbourne Stars : ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 156 పరుగులను సాధించారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ తమ ధనాధన్ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థులను అబ్బురపరిచారు. కెప్టెన్ జేమ్స్ విన్స్ భారీ స్కోర్ కూడా జట్టు స్కోర్‌కు తోడవ్వడం వల్ల సిడ్నీ జట్టు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో విన్స్ (57) పరుగులు చేశాడు.
కీపర్ ప్యాడ్‌లో చిక్కుకున్న బంతి- డేంజర్‌గా మారిన పిచ్- క్రికెట్లో విచిత్ర సంఘటనలు
ఆ మ్యాచ్‌లో రెండు సార్లు టాస్ - బిగ్ బాష్ లీగ్‌లో అంతే గురూ!