ETV Bharat / sports

Big Bash League 2023 : మరింత తగ్గిన షెడ్యూల్.. టీమ్​కు 10 మ్యాచులే.. కారణం అదేనా? - బిగ్ బాష్ లీగ్ 2023 మ్యాచ్​లు

Big Bash League 2023 : ఐపీఎల్​ తర్వాత అంతటి ఆదరణ పొందిన బిగ్ బాష్ లీగ్ షెడ్యూల్ మరింత తగ్గింది. ఆస్ట్రేలియాలో జరిగే ఈ లీగ్ 56 మ్యాచ్​ల నుంచి 40కు తగ్గించారు నిర్వాహకులు. అందుకు కారణం ఏంటంటే?

big bash league
big bash league 2023
author img

By

Published : May 12, 2023, 11:42 AM IST

Big Bash League 2023 : ప్రపంచ క్రికెట్​ చరిత్రలో ఇండియన్​ ప్రీమియర్ లీగ్​ తర్వాత ఆ స్థాయిలో క్రీడా అభిమానుల ఆదరణ పొందింది బిగ్ బాష్ లీగ్​. ఇందులో భారత్‌ మినహా వివిధ దేశాల స్టార్‌ క్రికెటర్లు కూడా సందడి చేస్తారు. ఆస్ట్రేలియా వన్డే, టీ20 జట్ల సభ్యుల్లో దాదాపు అందరూ ఈ లీగ్​లో పాల్గొంటారు. దేశవాళీ క్రికెటర్లు కూడా ఆడతారు.

ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు బిగ్​ బాష్​ లీగ్​ను అట్టహాసంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే మ్యాచ్​ల షెడ్యూల్​ను నిర్వాహకులు తగ్గించారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా.. శుక్రవారం ప్రకటించింది. దీంతో ఇక నుంచి ఏడాదికి ఒక ఫ్రాంఛైజీ గరిష్ఠంగా 10 మ్యాచ్​లు మాత్రమే ఆడే అవకాశం ఉంది.

తొలుత ఈ కొత్త మార్పులను వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని భావించినప్పటికీ.. బ్రాడ్‌కాస్టర్లతో కుదిరిన ఒప్పందం మేరకు ఈ ఏడాది నుంచే షెడ్యూల్ తగ్గించాలని నిర్ణయాన్ని తీసుకున్నారు. బిగ్ బాష్ లీగ్ షెడ్యూల్ చాలా ఎక్కువగా ఉందన్న విమర్శలను ఎదుర్కొన్న నేపథ్యంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీని వల్ల ఈ సీజన్​లో 56కు బదులు 40 మ్యాచ్​లే జరగనున్నాయి.

Big Bash League Play offs : మరోవైపు లీగ్​లోని ప్లేఆఫ్స్ విధానాన్ని కూడా మార్చనున్నారు నిర్వాహకులు. ఇన్నాళ్లూ ఐదు టీమ్స్ ప్లేఆఫ్స్​కు అర్హత సాధిస్తుండగా.. ఇక నుంచి కేవలం నాలుగు టీమ్స్ మాత్రమే ప్లేఆఫ్స్​కు క్వాలిఫై కానున్నాయి. ఈ ఏడాది జులైలో టోర్నీ షెడ్యూల్ అనౌన్స్ చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా.. డిసెంబర్​లో ఈ లీగ్ ప్రారంభం కానుంది. అంతే కాకుండా షెడ్యూల్ తగ్గించడం వల్ల ఇక నుంచి బిగ్ బాష్ లీగ్ మొత్తం మ్యాచ్​లు డిసెంబర్​ సెలవుల్లోనే పూర్తి కానుంది. దీనివల్ల అత్యధిక మ్యాచ్​లకు విదేశీ ప్లేయర్స్ అందుబాటులో ఉండేలా కూడా బిగ్ బాష్ నిర్వాహకులు ప్లాన్​ చేస్తున్నారు.

గతేడాది జరిగిన బిగ్​బాష్​ లీగ్​ ఫైనల్స్​లో ఆస్ట్రేలియాకు చెందిన పెర్త్​ స్కార్చర్స్ టీమ్​ ఘన విజయాన్ని సాధించింది​. సిడ్నీ సిక్సర్స్ టీమ్​ను 79 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. నాలుగో సారి టైటిల్​ను కైవసం చేసుకుంది. పెర్త్​ స్కార్చర్స్​ ఆటగాడు లారీ ఇవాన్స్​ 76 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా కూడా ఇవాన్స్​ నిలవడం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.