Bhuvneshwar Kumar Ranji 8 Wickets: టీమ్ఇండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కూమార్ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత టెస్టు ఫార్మాట్ (ఫస్ట్ క్లాస్ కెరీర్)లో రీ ఎంట్రీ ఇచ్చిన భువీ తొలి మ్యాచ్‌లోనే 8 వికెట్లతో సత్తా చాటాడు. భువీ ప్రస్తుత రంజీ ట్రోఫీలో ఉత్తర్‌ప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్- బంగాల్ మధ్య మ్యాచ్‌లో భువీ ఎనిమిది వికెట్లు నేలకూల్చి ఔరా అనిపించాడు. భువీ దెబ్బకు బంగాల్ 188 పరుగులకే ఆలౌటైంది. దీంతో భువనేశ్వర్ ఒక్కసారిగా క్రికెట్ విశ్లేషకుల దృషిని తనవైపు తిప్పుకున్నాడు.
జనవరి 12న ఉత్తర్‌ప్రదేశ్- బంగాల్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన బంగాల్, యూపీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి ఇన్నింగ్స్‌లో యూపీ 20.5 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌటైంది. దీంతో బంగాల్ తొలి రోజే బ్యాటింగ్‌కు దిగింది. అయితే యూపీ బౌలర్ భువీ ఆరంభం నుంచే స్వింగ్‌తో బ్యాటర్లను తికమక పెట్టాడు. దీంతో తొలి రోజే 5 వికెట్లు పడగొట్టి బంగాల్‌ను తీవ్రంగా దెబ్బకొట్టాడు. ఇక బంగాల్ 95-5స్కోర్ వద్ద తొలిరోజు ఆట ముగిసింది. అయితే బంగాల్ ఫస్ట్ డే కోల్పోయిన 5 వికెట్లు కూడా భువీ పడగొట్టినవే కావడం విశేషం. ఇక 95-5 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో బ్యాటింగ్ ప్రారంభించిన బంగాల్ 58.2 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. యూపీ బౌలర్లలో భువనేశ్వర్ 8, యశ్ దయాల్ 2 వికెట్లు పడగొట్టారు.
-
.@BhuviOfficial on fire 🔥
— BCCI Domestic (@BCCIdomestic) January 12, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
A five-wicket haul and he's taken all 5⃣ Bengal wickets to fall so far. What a splendid spell 👌👌@IDFCFIRSTBank | #RanjiTrophy | #UPvBEN
Follow the match ▶️ https://t.co/yRqgNJxmLY pic.twitter.com/Dqu0OgJMk0
">.@BhuviOfficial on fire 🔥
— BCCI Domestic (@BCCIdomestic) January 12, 2024
A five-wicket haul and he's taken all 5⃣ Bengal wickets to fall so far. What a splendid spell 👌👌@IDFCFIRSTBank | #RanjiTrophy | #UPvBEN
Follow the match ▶️ https://t.co/yRqgNJxmLY pic.twitter.com/Dqu0OgJMk0.@BhuviOfficial on fire 🔥
— BCCI Domestic (@BCCIdomestic) January 12, 2024
A five-wicket haul and he's taken all 5⃣ Bengal wickets to fall so far. What a splendid spell 👌👌@IDFCFIRSTBank | #RanjiTrophy | #UPvBEN
Follow the match ▶️ https://t.co/yRqgNJxmLY pic.twitter.com/Dqu0OgJMk0
Arjun Tendulkar Ranji Trophy: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కుమారుడు అర్జున్ తెందూల్కర్ బ్యాట్‌తో రాణించాడు. గోవా తరఫున ఆడుతున్న అర్జున్ 7వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 60 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. ఇక గోవా బ్యాటర్లలో ఫ్రభుదేశాయ్ (197 పరుగులు), ధీరజ్ (115 పరుగులు) అద్భుత సెంచరీలతో రాణించారు. దీంతో గోవా తొలి ఇన్నింగ్స్‌లో 618 భారీ స్కోర్ నమోదు చేసింది.
గోల్డ్ చైన్ అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చిన అమ్మ- తల్లి కలను బతికిస్తున్న క్రికెటర్
రంజీ ట్రోఫీలో మెడల్ ప్రజెంటేషన్- క్రికెట్లో పతకం ఇదే తొలిసారి!