Ben stokes batting record: ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్, డర్హమ్ జట్టు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కౌంటీ క్రికెట్లో అరుదైన రికార్డ్ సృష్టించాడు. ఒకే ఇన్నింగ్స్‌లో 17 సిక్సులు బాదాడు. ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌ను వెనక్కి నెట్టి కౌంటీ క్రికెట్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన వ్యక్తిగా నిలిచాడు. 1995లో జరిగిన కౌంటీ క్రికెట్లో గ్లూసెస్టర్‌షైర్ తరఫున ఆడిన సైమండ్స్ 16 సిక్సర్లు బాదాడు. 2011లో ఎసెక్స్ ప్లేయర్ గ్రాహం నేపియర్ ఒకే ఇన్నింగ్స్‌లో 16 సిక్సర్లు కొట్టి సైమండ్స్ సరసన నిలిచాడు. తాజాగా బెన్ స్టోక్స్ వారి రికార్డును తిరగరాశాడు.
వోర్సెస్టర్‌లోని న్యూరోడ్లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ టు 2022లో వోర్సెస్టర్‌షైర్‌పై ఈ ఫీట్‌ను సాధించాడు బెన్ స్టోక్స్. జోష్ బేకర్ వేసిన ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 34 పరుగులు రాబట్టాడు. దీంతో 59 బంతుల్లో 70 పరుగుల నుంచి.. 64 బంతుల్లోనే 100 పరుగులకు చేరుకున్నాడు. ఆ తర్వాత ధాటిగా ఆడిన బెన్‌స్టోక్స్ 88 బంతుల్లోనే 161 పరుగులు (8 ఫోర్లు, 17 సిక్సర్ల) చేసి స్పిన్నర్ బ్రెట్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
-
6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 4️⃣
— LV= Insurance County Championship (@CountyChamp) May 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
What. An. Over.
34 from six balls for @benstokes38 as he reaches a 64 ball century 👏#LVCountyChamp pic.twitter.com/yqPod8Pchm
">6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 4️⃣
— LV= Insurance County Championship (@CountyChamp) May 6, 2022
What. An. Over.
34 from six balls for @benstokes38 as he reaches a 64 ball century 👏#LVCountyChamp pic.twitter.com/yqPod8Pchm6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 4️⃣
— LV= Insurance County Championship (@CountyChamp) May 6, 2022
What. An. Over.
34 from six balls for @benstokes38 as he reaches a 64 ball century 👏#LVCountyChamp pic.twitter.com/yqPod8Pchm
స్టోక్స్ విధ్వంసంతో ఆట ముగిసే సమయానికి డర్హమ్ జట్టు 128 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 580 పరుగులు చేసింది. సీన్ డిక్సన్(104), కీగన్ పీటర్సన్(50), కెప్టెన్ స్కాట్ బొర్త్విక్(89), డేవిడ్ బెడింగమ్(135) రాణించారు. వోర్సెస్టర్షైర్ బౌలర్ బెన్ గిబ్బన్ 25 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు.
ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్సీ నుంచి జో రూట్ తప్పుకున్న తర్వాత.. స్టోక్స్‌ను సారథిగా నియమిస్తున్నట్లు గత నెలలో ప్రకటించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. రూట్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్న స్టోక్స్ ఇంగ్లాండ్ పురుషుల టీమ్‌కు సారథ్యం వహించనున్న 81 వ్యక్తిగా నిలవనున్నాడు.
ఇదీ చూడండి: కఠిక పేదరికం.. కడుపు నిండా తిండి లేని దైన్యం.. కల మాత్రం ఒక్కటే