ETV Bharat / sports

మూడుసార్లు ఆర్​టీపీసీఆర్​ టెస్ట్​.. నెగెటివ్ వస్తేనే ఇంగ్లాండ్​కు.. - ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​

ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన ఆటగాళ్ల కోసం ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. క్రికెటర్లు ముంబయికి చేరుకోవడానికి ముందే వారి ఇళ్ల వద్ద మూడు సార్లు ఆర్​టీపీసీఆర్​ పరీక్షను చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో నెగెటివ్ నివేదిక వస్తేనే ముంబయిలో క్వారంటైన్​కు అనుమతిస్తారు.

team india, bcci
టీమ్​ఇండియా, బీసీసీఐ
author img

By

Published : May 15, 2021, 2:32 PM IST

ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టు కోసం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లందరూ మే19న ముంబయిలో సమావేశమవ్వడానికంటే ముందే.. మూడు సార్లు ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. వాటిల్లో నెగెటివ్ వస్తేనే ముంబయికి వెళ్లాలి.

ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​తో పాటు ఇంగ్లాండ్​తో సుదీర్ఘ సిరీస్​కు ఎంపికైన ఆటగాళ్లు.. తొలుత మూడు సార్లు ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు చేయించుకోవాలి. వాటిలో నెగెటివ్​ రిపోర్టు వస్తేనే ముంబయికి చేరుకోవాలి. అక్కడ 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్​లో ఉండాలి. అక్కడి నుంచి టీమ్​ఇండియా జూన్​ 2న ఇంగ్లాండ్​కు బయల్దేరుతుంది. అని క్రికెట్​ వర్గాలు పేర్కొన్నాయి.

ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లలో దాదాపు అందరూ కొవిడ్​ టీకా తొలి డోసును తీసుకున్నారు. రెండో డోసును యూకే ప్రభుత్వ అనుమతితో తీసుకోనున్నారు.

ఇప్పటికే 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. వారితో పాటు నలుగురు స్టాండ్​ బై ఆటగాళ్లను ఎంపిక చేసింది. వారిలో ప్రసిధ్ కృష్ణ, అవేశ్​ ఖాన్, అర్జాన్ వంటి ముగ్గురు ఫాస్ట్​ బౌలర్లు ఉన్నారు. ఐపీఎల్​ సందర్భంగా కరోనా బారిన పడిన ప్రసిధ్ ఇంకా కోలుకోలేదు. ​

ఇదీ చదవండి: ఎవరెస్ట్​ అధిరోహకురాలిని ప్రశంసించిన కిరెన్​ రిజిజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.