ఐపీఎల్ మాజీ జట్టు డెక్కన్ ఛార్జర్స్‌తో(deccan chargers) న్యాయపోరాటంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) విజయం సాధించింది. కోర్టు తీర్పు అనంతరం దీని గురించి మాట్లాడిన బీసీసీఐ అధికారి ఒకరు.. ఇది ఆహ్వానించదగ్గ విషయమని పేర్కొన్నారు.
డెక్కన్ ఛార్జర్స్.. ఐపీఎల్లో(IPL) 2009 నుంచి 2012 వరకు కొనసాగింది. ఈ ఫ్రాంచైజీకి యజమాని అయిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్(DCHL).. రూ.100 కోట్ల ష్యూరిటీ ఇవ్వడంలో విఫలమైందంటూ బీసీసీఐ, 2012లో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో బీసీసీఐ, డీసీహెచ్ఎల్ వివాదం మొదలైంది. అనంతరం అదే ఏడాది డెక్కన్ ఛార్జర్స్‌ను రద్దు చేస్తున్నట్లు భారత బోర్డు ప్రకటించింది. దీంతో సదరు ఫ్రాంచైజీ యాజమాన్యం బాంబే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
నష్టపరిహారం, వడ్డీ ఖర్చుల కింద రూ.8 వేల కోట్లు, బీసీసీఐ చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని డెక్కన్ ఛార్జర్స్ కోర్టును కోరింది. అనంతరం బీసీసీఐ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, అప్పటినుంచి వాదనలు నడుస్తూనే ఉన్నాయి. తాజగా బీసీసీఐకి అనుకూలంగా బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.
ఇవీ చదవండి: