BCCI Team India : క్రికెట్లో పెద్ద దేశాలు ఏదైనా అప్రాధాన్య సిరీస్ ఆడాల్సి వస్తే మేనేజ్మెంట్ ఆ టోర్నీలకు.. సెకెండ్ క్లాస్ జట్లను పంపడం మామూలే. కానీ ఒక దేశం నుంచి ఒకే సమయంలో వేర్వేరు జట్లు వేర్వేరు సిరీస్‌లు ఆడటం మాత్రం అరుదైన విషయం. ఇక భారత క్రికెట్ చరిత్రలో గత రెండేళ్లుగా ఈ ఒరవడి కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో బీసీసీఐ కూడా అవసరాన్ని బట్టి తరచుగా రెండు జట్లను బరిలోకి దించుతోంది. అలా అని రెండో జట్టును 'ద్వితీయ శ్రేణి' అని తక్కువ చేయలేం. అది కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లే ఉండటం విశేషం.
ఇటీవలే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగింది టీమ్ఇండియా. అయినప్పటికీ బలమైన జట్టుతో రంగంలోకి దిగిన ఆస్ట్రేలియాను వరుసగా రెండు మ్యాచుల్లో చిత్తు చేసి ఓడించి సిరీస్‌ను చేజిక్కించుకుంది. అయితే అప్పటి మ్యాచ్‌లకు అందుబాటులో లేని నలుగురు కీ ప్లేయర్స్ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నారు. తొలి రెండు వన్డేల్లో ఓపెనర్‌గా ఆడిన రుతురాజ్ గైక్వాడ్.. ఆసియా క్రీడల కోసం హాంగ్‌జౌకు వెళ్తున్నాడు. దీంతో మూడో వన్డేకు అతను అందుబాటులో ఉండటం లేదు.
ఇక రుతురాజ్ నాయకత్వంలోనే మరో భారత జట్టు ఆసియా క్రీడల్లో తలపడనుంది.అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, అవేష్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్.. ఇలా చాలామంది ప్లేయర్లు ఆసియా క్రీడల్లో గైక్వాడ్‌తో ఆడనున్నారు. ఎక్కువగా కుర్రాళ్లు ఉన్నారన్న మాటే కానీ.. అందరూ అంతర్జాతీయ క్రికెట్లో అదరగొట్టే స్థాయిలో ఉన్న వాళ్లే. ఇలా ఒకేసారి రెండు అంతర్జాతీయ జట్లను బరిలోకి దించే స్థాయిలో భారత్ ఉందంటే మన క్రికెట్ ప్రమాణాలు ఎంత గొప్పగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇదేం తొలిసారి కాదు
BCCI Indian Cricket Team : భారత్ ఇలా ఒకే సారి వేర్వేరు జట్లను బరిలోకి దించడం ఇదేం తొలిసారి కాదు. రెండు నెలల క్రితం ఓ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. అప్పుడు హార్దిక్ పాండ్య నాయకత్వంలో ఓ జట్టు టీ20 సిరీస్ ఆడుతుండగా.. బుమ్రా సారథ్యంలో మరో జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది. గత ఏడాది దక్షిణాఫ్రికాతో ఓ భారత క్రికెట్ జట్టు టీ20 సిరీస్ ఆడింది. అది ముగించుకున్నాక రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టు టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు పయనమైంది. కానీ ఆ సిరీస్‌లో తలపడ్డ దక్షిణాఫ్రికా జట్టుతో వెంటనే శిఖర్ ధావన్ నేతృత్వంలోని మరో టీమ్ వన్డే సిరీస్ ఆడింది. ఇక ఈ రెండు సిరీస్‌ల్లోనూ భారత్‌దే విజయం కావడం విశేషం.
ఈ క్రమంలో 2021 నుంచి భారత్ తరచుగా అవసరాన్ని బట్టి రెండో జట్టుతో సిరీస్‌లు ఆడిస్తోంది. ఆ ఏడాది విరాట్ కోహ్లి సారథ్యంలో ప్రధాన జట్టు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లగా.. అదే సమయంలో ధావన్ నాయకత్వంలో మరో జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. అక్కడ వన్డే, టీ20 సిరీస్‌లను సొంతం చేసుకుంది. నిరుడు వెస్టిండీస్‌లో వన్డే సిరీస్ కోసం కూడా రెండో జట్టును పంపారు.
అంతర్జాతీయ మ్యాచ్‌లు పెరిగిపోవడం, దీనికి ఐపీఎల్ కూడా తోడవుతుండటం వల్ల ఒకే జట్టుతో అన్ని సిరీస్‌లూ ఆడించడమంటే ఆటగాళ్లకు మోయలేని భారంగా మారింది. అదే సమయంలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించేందుకు ఎదురు చూస్తున్న ప్రతిభావంతులకు కూడా కొదవ లేదు. అందుకే బీసీసీఐ ఈ రెండు జట్ల ఆలోచనను ఆచరణలోకి తెచ్చింది. దీని వల్ల బలమైన దేశవాళీ వ్యవస్థ, ఐపీఎల్ మెరుగుపడి ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్‌లో ప్రతిభ చాటుకున్న కుర్రాళ్లు వేగంగా అంతర్జాతీయ స్థాయికి దూసుకెళ్తున్నారు. ఇక సెలక్టర్లు కూడా కుర్రాళ్లకు భారత జట్టులో ఉదారంగా అవకాశాలు ఇస్తున్నారు. మ్యాచ్‌లు, సిరీస్‌ల సంఖ్య పెరగడం వల్ల గతంతో పోలిస్తే ఎక్కువ మంది భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించగలుగుతున్నారు. ఒకేసారి రెండు కాదు మూడు జట్లను బరిలోకి దించే సత్తా భారత్‌కు ఉందని బ్రయాన్ లారా లాంటి దిగ్గజం వ్యాఖ్యానించడం మన ప్రతిభకు నిదర్శనం.
-
Mohali ✅
— BCCI (@BCCI) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Indore ✅#TeamIndia arrive ✈️ for the third and the final ODI in Rajkot 👌#INDvAUS pic.twitter.com/pIrDvPFNyB
">Mohali ✅
— BCCI (@BCCI) September 25, 2023
Indore ✅#TeamIndia arrive ✈️ for the third and the final ODI in Rajkot 👌#INDvAUS pic.twitter.com/pIrDvPFNyBMohali ✅
— BCCI (@BCCI) September 25, 2023
Indore ✅#TeamIndia arrive ✈️ for the third and the final ODI in Rajkot 👌#INDvAUS pic.twitter.com/pIrDvPFNyB
Ind Vs Aus ODI Series : ఆసీస్‌పై ఘన విజయం.. రెండో వన్డేలో నమోదైన 11 రికార్డులు ఇవే
Ind vs SL Asian Games : అదరగొట్టిన అమ్మాయిలు.. ఫైనల్స్‌లో లంకపై విజయం.. భారత్ ఖాతాలో మరో పసిడి