ETV Bharat / sports

బీసీసీఐ మరో కీలక నిర్ణయం.. పురుషుల క్రికెట్‌లో మహిళా అంపైర్లు.. హెడ్​ కోచ్​ సంగతేంటి!

భారత క్రికెట్​లో మరో ముందడుగు దిశగా బీసీసీఐ ప్రణాళిక రచిస్తోంది. పురుషుల క్రికెట్​లో మహిళా అంపైర్లను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

author img

By

Published : Dec 6, 2022, 1:11 PM IST

Updated : Dec 6, 2022, 4:59 PM IST

Women umpires in Ranji Trophy soon
బీసీసీఐ మరో కీలక నిర్ణయం.. పురుషుల క్రికెట్‌లో మహిళా అంపైర్లు!

క్రికెట్‌లో మహిళల భాగస్వామ్యం పెంచే దిశగా బీసీసీఐ మరో అడుగు ముందుకు వేయనుంది. దేశ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా పురుషుల క్రికెట్​లో మహిళా అంపైర్లను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో ప్రారంభం కాబోయే రంజీ ట్రోఫీ-2022 నుంచి ఈ ప్లాన్​ను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి బోర్డు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

"త్వరలో ప్రారంభంకాబోయే రంజీ సీజన్ నుంచి మ్యాచ్​లకు ఉమెన్ అంపైర్లు కూడా అంపైరింగ్ చేయబోతున్నారు. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్​లలో కూడా మహిళా అంపైర్లను (భారత్ ఆడే మ్యాచ్​లకు) చూడొచ్చు.." అని ఓ బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. ఇటీవలే మహిళా క్రికెటర్ల వేతనాలను పురుషులతో సమానంగా పెంచిన బీసీసీఐ తాజాగా మరో చారిత్రక నిర్ణయం తీసుకోవడం అభినంచదగ్గ విషయం

మహిళా అంపైర్లుగా వృందా రతి, జనని నారాయణ్, వేణుగోపాలన్​లు ప్రస్తుతం భారత మహిళా జట్టు ఆడేమ్యాచ్ లకు పనిచేస్తున్నారు. ఈ ముగ్గురే ఇప్పుడు ఉమెన్ అంపైర్లుగా రంజీలలో కనిపించనున్నట్టు సమాచారం. ముంబయికి చెందిన వృందా రతి.. స్కోరర్గా పనిచేసేవారు. కానీ న్యూజిలాండ్​కు చెందిన అంపైర్ కాతీ క్రాస్ స్ఫూర్తితో ఆమె అంపైర్​గా రాణిస్తున్నారు. తమిళనాడుకు చెందిన జనని నారాయణ్ చెన్నైలో సాఫ్​వేర్​ ఇంజినీర్ ఉద్యోగాన్ని వదిలి అంపైర్​ను కెరీర్​గా ఎంచుకున్నారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన అంపైర్ల ఇంటర్వ్యూలో నెగ్గిన ఆమె తర్వాత బీసీసీఐ నిర్వహించే మ్యాచ్​లకు కూడా అంపైరింగ్ చేస్తున్నారు. ఇక గాయత్రి వేణుగోపాలన్​కు కూడా మొదట్లో క్రికెట్ గురించి పెద్దగా అవగాహన లేకపోయినా తర్వాత ఆట మీద ఆసక్తితో అంపైరింగ్​లోకి వచ్చారు.

మహిళా జట్టు హెడ్​ కోచ్​ సంగతేంటి.. బోర్డు పునర్​వ్యవస్థీకరణలో భాగంగా.. సీనియర్​ మహిళా జట్టు హెడ్​ కోచ్​గా​ ఉన్న రమేశ్​ పవార్​ను జాతీయ క్రికెట్​ అకాడమీ(ఎన్​సీఏ)కు బదిలీ చేసింది బీసీసీఐ.​ అకాడమీలో పురుషుల జట్టుకు స్పిన్​ బౌలింగ్​ కోచ్​గా నియమించింది. కాగా, ఇదివరకు ఇండియా ఏ, ఇండియా అండర్​ 19 జట్లకు పనిచేసిన టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ హృషికేశ్​ కనిట్కర్​ను సీనియర్ మహిళా జట్టుకు బ్యాటింగ్ కోచ్​గా నియమించింది. ఆస్ట్రేలియాతో జరగబోయే 5 మ్యాచ్​వ టీ20 సిరీస్​కు మహిళా జట్టును ఆయన సన్నద్ధం చేయనున్నారు. అయితే ఇప్పటివరకు మహిళా జట్టు హెడ్​ కోచ్​ను మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు.

ఇదీ చూడండి: మ్యాచ్​ మధ్యలో ఫ్యాన్స్​తో గొడవపడిన పాక్ క్రికెటర్​.. కొట్టేందుకు యత్నం

Last Updated : Dec 6, 2022, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.