వచ్చేనెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2021) ట్రోఫీని బీసీసీఐ (BCCI) సెక్రెటరీ జై షా ఆవిష్కరించారు. జట్టు వివరాలను బీసీసీఐ త్వరలో ప్రకటించనుంది. ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల వివరాలు సమర్పించేందుకు సెప్టెంబరు 10 తుది గడువుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. ఆలోపు అంటే సెప్టెంబరు 6 లేదా 7వ తేదీల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తుదిజట్టును ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
![T20 World Cup 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12954210_e-rxn1xvqaowoop.jpg)
చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ తుది జట్టును ఎంపిక చేయనుంది. అక్గోబరు 17న ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. ఒక్కో జట్టు నుంచి 15 మంది ఆటగాళ్లు, 8 మంది సిబ్బందిని మాత్రమే అనుమతిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. కరోనా కారణంగా ఈసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్ దేశాల్లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: కోహ్లీ సరికొత్త రికార్డు.. వేగవంతమైన బ్యాట్స్మన్గా ఆ ఘనత