ETV Bharat / sports

IPL: మరో దెబ్బ.. ఐపీఎల్​కు ఆ మూడు దేశాల క్రికెటర్లు దూరం!

మరో రెండు నెలల్లో జరగబోయే ఐపీఎల్​కు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. పలు దేశాల క్రికెటర్లు మిగిలిన మ్యాచ్​ కోసం పాల్గొనడం కష్టమని చెప్పగా, ఇప్పుడు మరికొన్ని దేశాల ఆటగాళ్లు రావడం సందేహంగా మారింది.

BCCI Reacts To Australia's Plans Of Hosting Tri-series With WI, Afghanistan
ఐపీఎల్ న్యూస్
author img

By

Published : Jun 20, 2021, 8:18 AM IST

Updated : Jun 20, 2021, 9:27 AM IST

కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్​.. సెప్టెంబరు-అక్టోబరులో యూఏఈ వేదికగా జరగనుంది. సరిగ్గా అదే సమయంలో మ్యాచ్​లు, సిరీస్​లు ఉన్నాయని, దాంతో తమ ఆటగాళ్లు లీగ్​లో పాల్గొనడం కుదరదని ఇంగ్లాండ్, బంగ్లాదేశ్​ బోర్డు ఇదివరకే స్పష్టం చేశాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా, వెస్టిండీస్​, అఫ్ఘానిస్థాన్ క్రికెటర్లు కూడా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ipl news
ఐపీఎల్ 2021

షెడ్యూల్​ ప్రకారం అక్టోబరు 18 నుంచి టీ20 ప్రపంచకప్​ భారత్​లో జరగనుంది. అందుకోసం ప్రిపరేషన్​గా పలు ద్వైపాక్షిక సిరీస్​లు ఆడనున్నాయి. అయితే ఏప్రిల్-మే లో జరగాల్సిన ఐపీఎల్​ మ్యాచ్​లు.. కరోనా కారణంగా సెప్టెంబరు-అక్టోబరులో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్​ బోర్డులు తమ ఆటగాళ్లు, ఐపీఎల్​లో తిరిగి ఆడేందుకు రావడం కుదరదని బీసీసీఐకి ముందే చెప్పేశాయి.

ఇటీవల ఆస్ట్రేలియా కూడా వెస్టిండీస్, ఆఫ్ఘానిస్థాన్​తో త్రైపాక్షిక సిరీస్ నిర్వహించనున్నట్లు తెలిపింది. దీనివల్ల రషీద్ ఖాన్, పొలార్డ్, రసెల్, హెట్మయిర్​ లాంటి ఆటగాళ్లు లీగ్​లో పాల్గొనకపోవచ్చు! ఈ విషయమై బీసీసీఐకి ఎలాంటి సమాచారం లేదు. అయితే సదరు దేశాల క్రికెటర్లు లీగ్​లో పాల్గొంటారని భావిస్తోంది భారత క్రికెట్ బోర్డు.

గతంలో ఐపీఎల్​ రీషెడ్యూల్​ మ్యాచ్​ల గురించి మాట్లాడిన బీసీసీఐ కార్యదర్శి జైషా.. విదేశీ ఆటగాళ్లు ఎవరూ లేకపోయినా సరే మ్యాచ్​లు జరిపి తీరుతామని స్పష్టం చేశారు. ఒకవేళ ఇది జరిగితే విదేశీ స్టార్ ఆటగాళ్లు లేకుండా మ్యాచ్​లు ఆసక్తిగా ఉంటాయా అనే సందేహం వస్తోంది.

ipl bcci
ఐపీఎల్ బీసీసీఐ

ఇవీ చదవండి:

Last Updated : Jun 20, 2021, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.