ETV Bharat / sports

బీసీసీఐ పెద్ద మనసు.. క్యురేటర్స్​, గ్రౌండ్స్​మెన్​కు ప్రైజ్​మనీ - ఐపీఎల్ 2022 ప్రైజ్​మనీ కుర్యేటర్స్​

IPL 2022 venue prizemoney: ఐపీఎల్​ 2022 మ్యాచ్​ వేదికలకు చెందిన క్యురేటర్స్​, గ్రౌండ్స్​మెన్​కు బీసీసీఐ రూ.1.25కోట్ల ప్రైజ్​మనీ ప్రకటించింది. వాళ్ల హార్డ్‌ వర్క్‌ వల్లే లీగ్‌లో కొన్ని మ్యాచ్‌లు ఎంతో ఉత్కంఠగా జరిగాయని బోర్డు కార్యదర్శి జై షా అభినందించారు.

BCCI Prize money for Curators groundsmen of IPL 2022
క్యూరేటర్స్​, గ్రౌండ్స్​మెన్​కు ప్రైజ్​మనీ
author img

By

Published : May 30, 2022, 10:23 PM IST

IPL 2022 venue prizemoney: ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్ 2022లో గుజరాత్​ టైటాన్స్​ విజేతగా నిలిచింది. ఇక ఈ సీజన్​లో విజేతగా నిలిచిన ఈ జట్టుతో పాటు అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు నగదు బహుమతి దక్కింది. పిచ్​లు అటు బ్యాట్​, ఇటు బాల్​కు అనుకూలించడం వల్ల మ్యాచ్​లు రసవత్తరంగా సాగాయి.

అయితే తాజాగా బీసీసీఐ.. మ్యాచ్​లు నిర్వహించిన ఆరు వేదికల్లోని క్యురేటర్లు, గ్రౌండ్స్​మెన్​కు రూ.1.25కోట్ల ప్రైజ్​మనీ ప్రకటించింది. ఎక్కువ మ్యాచ్​లకు ఆతిథ్యమిచ్చిన సీసీఐ, వాంఖడే, డీవై పాటిల్​.. పుణెలోని ఎంసీఏ స్డేడియాలకు ఒక్కోదానికి రూ.25 లక్షలు ఇచ్చింది. ప్లేఆఫ్స్​ జరిగిన కోల్​కతాలోని ఈడెన్​ గార్డెన్స్​, అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్డేడియాలకు ఒక్కోదానికి 12.5 లక్షలను ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా సోషల్​మీడియాలో ట్వీట్​ చేశారు. కాగా, అద్భుతమైన మ్యాచ్‌లను అందించిన గ్రౌండ్‌ సిబ్బందికి ప్రైజ్‌మనీ ప్రకటించడం సంతోషంగా ఉందని, ఈ క్యురేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌ తెర వెనుక హీరోలని ట్విటర్‌లో జై షా పేర్కొన్నారు. వాళ్ల హార్డ్‌ వర్క్‌ వల్లే లీగ్‌లో కొన్ని మ్యాచ్‌లు ఎంతో ఉత్కంఠ రేపాయని చెప్పారు.

ఇదీ చూడండి: గుజరాత్​ టైటాన్స్​కు ఘనస్వాగతం.. సత్కరించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.