BCCI President Pakistan Visit : బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా.. పాకిస్థాన్ పర్యటనకు వెళ్లారు. ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ)తోపాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆహ్వానం మేరకు ఆసియా కప్ మ్యాచ్‌లు చూసేందుకు వారిద్దరూ వెళ్లారు. అయితే తమ రెండు రోజుల పర్యటన పూర్తి క్రికెట్ కోసమేనని.. రాజకీయాలకు సంబంధం లేదని రాజీవ్ శుక్లా తేల్చి చెప్పారు.
-
#WATCH | Punjab: BCCI President Roger Binny and Vice-President Rajeev Shukla crossed the Attari–Wagah border to visit Pakistan for Asia Cup 2023 pic.twitter.com/oEot70doAq
— ANI (@ANI) September 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Punjab: BCCI President Roger Binny and Vice-President Rajeev Shukla crossed the Attari–Wagah border to visit Pakistan for Asia Cup 2023 pic.twitter.com/oEot70doAq
— ANI (@ANI) September 4, 2023#WATCH | Punjab: BCCI President Roger Binny and Vice-President Rajeev Shukla crossed the Attari–Wagah border to visit Pakistan for Asia Cup 2023 pic.twitter.com/oEot70doAq
— ANI (@ANI) September 4, 2023
Asia Cup 2023 BCCI : పంజాబ్‌లోని అమృత్సర్ సమీపంలోని ఉన్న భారత్-పాక్ సరిహద్దు ప్రాంతం అట్టారీ-వాఘా బోర్డర్ ద్వారా పాక్‌లోకి రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా సోమవారం ప్రవేశించారు. అంతకుముందు, అమృత్సర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ సమయంలో రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడారు. "ఈ రెండు రోజుల పర్యటన పూర్తిగా క్రికెట్ కోసమే.. రాజకీయంగా ఏమీ లేదు. విందుకు హాజరుకానున్నాం. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు అందులో పాల్గొంటాయి" అని రాజీవ్ శుక్లా తెలిపారు.
-
#WATCH | BCCI President Roger Binny, Vice -President Rajeev Shukla arrive at Punjab's Amritsar airport to visit Pakistan for Asia Cup 2023
— ANI (@ANI) September 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
"This two-day visit is purely from the point of view of cricket, nothing political...," says Shukla.
Roger Binny says "I am looking forward… pic.twitter.com/7TiKlBHexA
">#WATCH | BCCI President Roger Binny, Vice -President Rajeev Shukla arrive at Punjab's Amritsar airport to visit Pakistan for Asia Cup 2023
— ANI (@ANI) September 4, 2023
"This two-day visit is purely from the point of view of cricket, nothing political...," says Shukla.
Roger Binny says "I am looking forward… pic.twitter.com/7TiKlBHexA#WATCH | BCCI President Roger Binny, Vice -President Rajeev Shukla arrive at Punjab's Amritsar airport to visit Pakistan for Asia Cup 2023
— ANI (@ANI) September 4, 2023
"This two-day visit is purely from the point of view of cricket, nothing political...," says Shukla.
Roger Binny says "I am looking forward… pic.twitter.com/7TiKlBHexA
టోర్నమెంట్ కోసం భారత్ జట్టు.. ఎందుకు పాకిస్థాన్‌కు వెళ్లలేదని విలేకరులు ప్రశ్నించారు. తాము కేంద్ర ప్రభుత్వ సలహా ప్రకారమే నడుచుకుంటామని.. సర్కార్ ఏది నిర్ణయిస్తే అదే చేస్తామని రాజీవ్ శుక్లా బదులిచ్చారు. శ్రీలంకలో మ్యచ్‌లను చూసేందుకు కొలంబో వెళ్లినప్పటి నుంచి పాక్ పర్యటన కోసం తానెంతో ఎదురు చూస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ తెలిపారు. 2006 తర్వాత రోజర్ బిన్నీ పాక్‌కు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Asia Cup 2023 Teams : భారత్ వేదికగా ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్‌నకు సన్నాహకంగా భావిస్తున్న ప్రతిష్టాత్మక ఆసియా కప్ ఆగస్టు 30న ప్రారంభమైంది. సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీ జరగనుంది. పాక్‌లోని ముల్తాన్, లాహోర్‌తో పాటు శ్రీలంకలో పల్లెకెల్లె, కొలొంబో స్టేడియాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. భారత్, పాకిస్థాన్, నేపాల్ గ్రూప్-ఏలో, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ గ్రూప్-బిలో ఉన్నాయి.
Asia Cup 2023 Points Table : టోర్నీలో భాగంగా ఆగస్టు 30న నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచింది. ఆ తర్వాత భారత్- పాక్ మధ్య జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌ను.. టీమ్ఇండియా ఇన్నింగ్స్ తర్వాత వర్షం కారణంగా నిలిపివేయడం వల్ల ఇరు జట్లకు రెండు పాయింట్లు లభించాయి. దీంతో పాక్.. ఇప్పటికే సూపర్-4కు చేరుకుంది. సోమవారం.. భారత్ తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో పసికూన నేపాల్‌తో తలపడింది. మరోవైపు, ఆసియా కప్‌లో నేపాల్ ఆడటం ఇదే తొలిసారి.
Ind vs Pak Asia Cup 2023 : డోంట్ వర్రీ ఫ్యాన్స్.. టోర్నీలో మరో ఇండో-పాక్ మ్యాచ్.. డేట్ ఫిక్స్!