ETV Bharat / sports

BCCI on Ranji Trophy: 'రెండు దశల్లో రంజీ ట్రోఫీ నిర్వహణ' - రంజీ ట్రోఫీపై బీసీసీఐ

BCCI on Ranji Trophy: ఒమిక్రాన్​ వ్యాప్తి నేపథ్యంలో ఏడాది ఆరంభంలోనే దేశవాళీ టోర్నీలు వాయిదా వేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ప్రస్తుతం రంజీ ట్రోఫీ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది.

bcci
బీసీసీఐ
author img

By

Published : Jan 27, 2022, 9:59 PM IST

BCCI on Ranji Trophy: దేశంలో కొవిడ్ పరిస్థితుల కారణంగా ఇటీవలే దేశవాళీ టోర్నీలు వాయిదా వేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). తాజాగా ఈ టోర్నీలను తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ పునరాలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు బీసీసీఐ కోశాధికారి అరుణ్​ ధుమాల్ రంజీ ట్రోఫీ నిర్వహణపై క్లారిటీ ఇచ్చారు. రెండు దశల్లో టోర్నీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

"రంజీ ట్రోఫీ వాయిదా వేసిన సమయంలో దేశంలో కొవిడ్​ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం కేసులు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఐపీఎల్​కు ముందు, తర్వాత రంజీ ట్రోఫీని నిర్వహించేలా బీసీసీఐ ప్లాన్​ చేస్తోంది."

--అరుణ్ ధుమాల్, బీసీసీఐ కోశాధికారి.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షాతో సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు అరుణ్​ ధుమాల్. ఫిబ్రవరిలో తొలి దశ రంజీ ట్రోఫీ నిర్వహించి.. జూన్-జులైలో రెండో దశ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రాల వినతి మేరకు..

2021-22 రంజీ ట్రోఫీ సహా చోటా కే నాయుడు ట్రోఫీ, సీనియర్ ఉమెన్స్ టీ20 లీగ్ కూడా కొవిడ్​ కారణంగా వాయిదా పడ్డాయి. అయితే.. రంజీ ట్రోఫీ నిర్వహణపై పునరాలోచన చేయాలని తొలుత రాష్ట్రాలకు చెందిన అధికారులు బోర్డు సభ్యులను కోరినట్లు తెలుస్తోంది. 'ఏప్రిల్ లేదా మే నెలలో రంజీ ట్రోఫీ నిర్వహించాలి. ఐపీఎల్ 15వ సీజన్​ జరుగుతుండగానే ఈ ట్రోఫీ కూడా నిర్వహిస్తే బాగుంటుంది.' అని రాష్ట్రాలకు చెందిన అధికారులకు చెప్పినట్లు సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

ఈ అథ్లెట్​ అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.