ETV Bharat / sports

క్రికెటర్​​ సాహాను బెదిరించిన జర్నలిస్టుపై నిషేధం - బోరియా మజుందార్​

భారత క్రికెటర్​ వృద్ధిమాన్ సాహాను బెదిరించిన జర్నలిస్టు బోరియా మజుందార్ పై రెండేళ్ల నిషేధం విధించింది బీసీసీఐ. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.

Wriddhiman Saha
క్రికెటర్​ సాహను బెదిరించిన జర్నలిస్టుపై రెండేళ్ల నిషేధం
author img

By

Published : May 4, 2022, 4:05 PM IST

Journalist Boria Majumdar ban: ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టు బోరియా మజుందార్​పై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). క్రికెటర్​ వృద్ధిమాన్ సాహాను అతను బెదిరించినందుకు గానూ ఈ మేరకు చర్యలు తీసుకుంది. అతడ్ని భారత క్రికెట్​తో సంబంధమున్న ఎలాంటి కార్యక్రమాలకు ఆహ్వానించవద్దని సూచించింది బీసీసీఐ.

BCCI Ban journalist Boria Majumdar: కొద్ది రోజుల క్రితం సాహాపై తీవ్ర విమర్శలు చేశాడు బోరియా మజుందార్. అతను అడిగినా ఇంటర్వ్యూ ఇవ్వలేదనే కోపంతో సాహాను బెదిరించాడు. దీనిపై విచారణకు బీసీసీఐ ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది. దర్యాపు జరిపిన ఈ బృందం సాహాను మజుందార్ బెదిరించింది నిజమే అని నివేదికలో తెలిపింది. అనంతరం బీసీసీఐ చర్యలకు ఉపక్రమించింది. మజుందార్​ను రెండేళ్ల పాటు నిషేధిస్తున్నట్లు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో తనను ఓ జర్నలిస్టు బెదిరించాడని సాహా తెలిపాడు. ఇందుకు సబంధించిన స్క్రీన్ షాట్​ను కూడా షేర్ చేశాడు. అయితే అప్పుడు జర్నలిస్టు పేరును మాత్రం వెల్లడించలేదు. కానీ ఆ పని చేసింది మజుందార్ అని తర్వాత తెలిసింది.

ఇదీ చదవండి: క్రికెట్ అకాడమీ కోసం ప్లాట్.. 33ఏళ్ల తర్వాత రిటర్న్ ఇచ్చిన గావస్కర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.