ETV Bharat / sports

కోహ్లీ కెప్టెన్సీ తొలగింపుపై పుకార్లు.. బీసీసీఐ ఏమందంటే! - అరుణ్ ధుమాల్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ

టీమ్ఇండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చాడు విరాట్ కోహ్లీ(virat kohli captaincy). దీని వెనక బలమైన కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. అలాగే కొందరు సీనియర్లు కోహ్లీ సారథ్యం పట్ల అసంతృప్తితో ఉన్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై స్పందించాడు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్.

Virat Kohli
కోహ్లీ
author img

By

Published : Sep 29, 2021, 3:11 PM IST

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ(virat kohli captaincy) ఇటీవల అభిమానులకు రెండు వరుస షాకులిచ్చాడు. తొలుత భారత జట్టుకు టీ20 ప్రపంచకప్‌ (T20 world cup 2021) తర్వాత ఈ ఫార్మాట్‌ నుంచి కెప్టెన్‌గా తప్పుకొంటున్నట్లు చెప్పిన అతడు.. ఐపీఎల్‌ తర్వాత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(royal challengers bangalore 2021) సారథిగానూ వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. స్వల్ప వ్యవధిలో కోహ్లీ ఇలా రెండు కీలక నిర్ణయాలు తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే, అవేంటన్నదే ఎవరికీ అంతుబట్టడం లేదు.

కాగా, కోహ్లీ(Virat Kohli News) ఇటీవల కాలంలో బ్యాటింగ్‌లో భారీ స్కోర్లు చేయలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు బ్యాటింగ్‌పై శ్రద్ధ పెట్టేందుకు ఈ నిర్ణయాలు తీసుకుని ఉంటాడని క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కోహ్లీ ప్రవర్తన బాగోలేదని, భారత జట్టుకు టీ20 కెప్టెన్‌(virat kohli captaincy)గా తొలగించాలని పలువురు సీనియర్లు బీసీసీఐని కోరినట్లు వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించిన కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌(arun dhumal bcci) అలాంటిదేమీ లేదని స్పష్టం చేశాడు. కోహ్లీ(Virat Kohli News) జట్టును బాగా నడిపిస్తున్నాడని, అలాంటప్పుడు తామెందుకు అతడిని తప్పుకోవాలని ఒత్తిడి తెస్తామని ఎదురు ప్రశ్నించాడు. అతడిని తప్పుకోవాలని బీసీసీఐ కోరలేదని వివరించాడు. అది పూర్తిగా కోహ్లీ నిర్ణయమని పేర్కొన్నాడు.

అనంతరం మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీని పొట్టి ప్రపంచకప్‌కు మెంటార్‌(ms dhoni mentor for t20)గా నియమించడంపై స్పందిస్తూ.. అతడో గొప్ప సారథి అని కీర్తించాడు అరుణ్ ధుమాల్(arun dhumal bcci) . అతడి సారథ్యంలో భారత్‌ మేటి జట్టుగా ఎదిగిందన్నాడు. ధోనీ కెప్టెన్సీ(ms dhoni records as captain)లో టీమ్‌ఇండియా 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిందని, అలాగే 2010, 2016 ఆసియా కప్‌లతో పాటు 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ సాధించిందని గుర్తుచేశాడు. అతడి రికార్డులన్నీ గొప్పగా ఉన్నాయన్నాడు. రాబోయే ప్రపంచకప్‌లో అతడిని మెంటార్‌గా కొనసాగించడం భారత జట్టుకు ఎంతో ఉపయోగకరమని, జట్టులోనూ ధోనీకి మంచి గౌరవం ఉందన్నాడు. మాజీ సారథిని మళ్లీ టీమ్‌ఇండియాకు తీసుకురావడం అనేది ఎవరినీ తక్కువ చేసినట్లు కాదని అరుణ్‌ ధుమాల్‌ వివరించాడు.

ఇవీ చూడండి: 'తర్వాత రెండు ప్రపంచకప్​లకు రోహిత్​ కెప్టెన్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.