ETV Bharat / sports

2021-22 సీజన్​ వేదికలు ఖరారు.. వైజాగ్​కు అవకాశం - 2021-22 సిరీస్ బీసీసీఐ

2021-22 సీజన్​కు సంబంధించి స్వదేశీ సిరీస్​ల వివరాలను ప్రకటించింది బీసీసీఐ(bcci news). ఈ సీజన్​లో న్యూజిలాండ్​, వెస్టిండీస్, శ్రీలంక, దక్షిణాఫ్రికాలకు ఆతిథ్యం ఇవ్వనుంది భారత్.

bcci
బీసీసీఐ
author img

By

Published : Sep 20, 2021, 4:49 PM IST

Updated : Sep 20, 2021, 5:25 PM IST

ప్రస్తుతం ఐపీఎల్​తో బిజీగా ఉన్న టీమ్ఇండియా తర్వాత టీ20 ప్రపంచకప్​కు సిద్ధమవుతుంది. అనంతరం భారత జట్టు స్వదేశీ పర్యటనలతో బిజీగా మారనుంది. తాజాగా ఇందుకు సంబంధించిన 2021-22 సీజన్​ షెడ్యూల్​(bcci schedule 2021-22)తో పాటు వేదికల్ని ఖరారు చేసింది బీసీసీఐ(bcci news). మొత్తంగా ఈ సీజన్​లో 14 టీ20, 3 వన్డే, 4 టెస్టులు ఆడనుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్​ ఓ మ్యాచ్​కు ఆతిథ్యం ఇవ్వనుంది.

  • తొలుత న్యూజిలాండ్​తో టీ20లతో పాటు టెస్టు సిరీస్​ ఆడుతుంది భారత జట్టు. ఈ రెండు జట్ల మధ్య తొలి టీ20 ఈ ఏడాది నవంబర్ 17న జరుగుతుంది. డిసెంబర్​ 7న ఈ పర్యటన పూర్తవుతుంది.
  • డిసెంబర్​-జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది భారత జట్టు.
  • అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్​తో వన్డే, టీ20 సిరీస్​ల్లో పాల్గొంటుంది భారత్. ఈ రెండు జట్ల మధ్య ఫిబ్రవరి 18న జరిగే రెండో టీ20కి వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది.
  • తర్వాత శ్రీలంకతో రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది టీమ్ఇండియా. ఈ సిరీస్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న మొదలై మార్చి 18న ముగుస్తుంది.
  • ఏప్రిల్-మేలో ఐపీఎల్-2022 జరగనుంది.
  • చివరగా వచ్చే ఏడాది జూన్​లో దక్షిణాఫ్రికాకు ఆతిథ్యం ఇవ్వనుంది భారత్. ఈ పర్యటనలో ఐదు టీ20లు జూన్ 9 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు.

రొటేషన్ ప్రకారం చాలా పట్టణాలు ఈ సిరీస్​కు(bcci schedule 2021-22) వేదికలుగా నిలిచాయి. జైపుర్, రాంచీ, లఖ్​నవూ, వైజాగ్, కోల్​కతా, అహ్మదాబాద్, కటక్, త్రివేండ్రం, చెన్నై, రాజ్​కోట్, దిల్లీకి ఆతిథ్య హక్కులు దక్కాయి.

టీమ్ఇండియా పూర్తి షెడ్యూల్ (జులై 2022 వరకు)

అక్టోబర్ 24-నవంబర్ 14 - టీ20 ప్రపంచకప్

నవంబర్ 17-డిసెంబర్ 7 - న్యూజిలాండ్​కు ఆతిథ్యం

డిసెంబర్ 17-జనవరి 26 - దక్షిణాఫ్రికా పర్యటన

ఫిబ్రవరి 6-ఫిబ్రవరి 20 - వెస్టిండీస్​కు ఆతిథ్యం

ఫిబ్రవరి 25-మార్చి 18 - శ్రీలంకకు ఆతిథ్యం

ఏప్రిల్-మే - ఐపీఎల్ 2022

జూన్ 9-జూన్ 19 - దక్షిణాఫ్రికాకు ఆతిథ్యం

జులై 1-జులై 14 - ఇంగ్లాండ్ పర్యటన

ఇవీ చూడండి: ఆ దేశంలో ఐపీఎల్​పై నిషేధం.. కారణం తెలిస్తే షాకవుతారు!

Last Updated : Sep 20, 2021, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.