ETV Bharat / sports

'పాక్ ఆటగాళ్ల వీసాలకు బీసీసీఐ అనుమతి.. కానీ'

రానున్న పొట్టి ప్రపంచకప్​ కోసం పాకిస్థాన్ క్రికెటర్లతో పాటు ఆ దేశ మీడియా సిబ్బందికి వీసాలకు అనుమతిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అభిమానులకు అంగీకారం తెలిపే అంశం కేంద్ర హోంశాఖ పరిధిలోనిదని వెల్లడించింది.

BCCI,  assured of visas to Pak team, media for T20 World Cup
బీసీసీఐ, టీ20 ప్రపంచకప్
author img

By

Published : Apr 17, 2021, 2:10 PM IST

Updated : Apr 17, 2021, 3:20 PM IST

ఈ ఏడాది ఆఖర్లో భారత్​ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్​ కోసం పాకిస్థాన్​ క్రికెటర్ల వీసాలకు అనుమతిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లతో పాటు ఆ దేశ మీడియాకు కూడా అనుమతిస్తున్నట్లు శుక్రవారం జరిగిన అపెక్స్​ సమావేశంలో నిర్ణయించింది.

ఇదీ చదవండి: యూత్​ బాక్సింగ్​​: ప్రి- క్వార్టర్స్​లో అంకిత్, మనీష్

తమ ఆటగాళ్లతో పాటు మీడియా, అభిమానుల వీసాలకు అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు.. అంతకుముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్​ ఎహ్సాన్ మణి పేర్కొన్నారు. ఒకవేళ ఈ విషయంలో భారత క్రికెట్ బోర్డు విఫలమైతే ప్రపంచకప్ వేదికను యూఏఈకి తరలించాలని ఐసీసీని పాక్ బోర్డు కోరింది.

ప్రస్తుతం ఆటగాళ్లతో పాటు మీడియాకు వీసాలను అనుమతించిన బీసీసీఐ.. అభిమానులకు వీసా అంగీకరించే అంశం హోంమంత్రిత్వ శాఖ పరిధిలోదని తెలిపింది. కాగా, కొవిడ్ నేపథ్యంలో స్వదేశీ ప్రేక్షకులకే అనుమతి లేని సమయంలో పాకిస్థాన్ అభిమానులకు అంగీకారం తెలుపుతారా అనేది వేచి చూడాలి.

ఇది సమష్టి విజయం..

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్​ గెలుపుపై ఆనందం వ్యక్తం చేశాడు ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్. ఇది ఏ ఒక్క వ్యక్తి ప్రదర్శన మాత్రమే కాదని.. సమష్టి విజయమని తెలిపాడు. వన్డే సిరీస్​ను అద్భుతంగా ప్రారంభించామని పేర్కొన్నాడు. ఫకర్ జమాన్ ఆటతీరు రోజురోజుకు మెరుగవుతోందని చెప్పాడు. బౌలర్లకు కూడా ఈ క్రెడిట్​​ దక్కుతుందని అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి: 2028 ఒలింపిక్స్​లో టీమ్​ఇండియా!

Last Updated : Apr 17, 2021, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.