ETV Bharat / sports

WTC final: మరో వారం రోజులే సమయం!

author img

By

Published : Jun 11, 2021, 11:37 AM IST

ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్(WTC final)​ ప్రారంభానికి మరో వారం రోజుల సమయమే మిగిలుంది. న్యూజిలాండ్(IND vs NZ)​తో తలబడబోయే మ్యాచ్​లో టీమ్ఇండియా ఆటగాళ్లకు అభిమానులు మద్దతుగా నిలవాలని భారత క్రికెట్​ నియంత్రణ మండలి(BCCI) ట్విట్టర్​ వేదికగా కోరింది.

BCCI asks fans to get behind team ahead of high-octane clash against NZ
WTC final: టీమ్ఇండియా

క్రికెట్​ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్(7 days for WTC Final)​ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సౌథాంప్టన్​ మైదానంలో టీమ్​ఇండియా క్రికెటర్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు. న్యూజిలాండ్​తో జరిగే తుదిపోరులో టీమ్​ఇండియా క్రికెటర్లకు తమ అభిమానులు మద్దతుగా నిలవాలని భారత క్రికెట్​ నియంత్రణ మండలి(BCCI) ట్విట్టర్​లో ఫ్యాన్స్​ను కోరింది.

"ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు మరో వారం రోజుల సమయమే ఉంది. తుదిపోరులో న్యూజిలాండ్​తో తలపడడానికి టీమ్ఇండియాకు అభిమానుల మద్దతు అవసరం" అని బీసీసీఐ ట్వీట్​ చేసింది.

#TeamIndia get into the groove for the #WTC21 Final 👊👊 pic.twitter.com/KIY1zvjyce

— BCCI (@BCCI) June 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరో ఏడు రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​(WTC Final) ముందు భారత జట్టు తమ ప్రాక్టీసును ముమ్మరం చేసింది. గెలుపే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తోంది. ఆటగాళ్లు వరుసగా రెండో రోజైన శుక్రవారం గ్రూప్​ ట్రైనింగ్​ సెషన్​లో పాల్గొన్నారు. ఆ వీడియోను బీసీసీఐ పోస్ట్​ చేసింది. డబ్ల్యూటీసీ కోసం జోరుగా సన్నద్ధమవుతున్నారని వెల్లడించింది.

ఇదీ చూడండి.. టీమ్​ఇండియా ప్రాక్టీస్​ హై ఇంటెన్సిటీతో..

క్రికెట్​ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్(7 days for WTC Final)​ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సౌథాంప్టన్​ మైదానంలో టీమ్​ఇండియా క్రికెటర్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు. న్యూజిలాండ్​తో జరిగే తుదిపోరులో టీమ్​ఇండియా క్రికెటర్లకు తమ అభిమానులు మద్దతుగా నిలవాలని భారత క్రికెట్​ నియంత్రణ మండలి(BCCI) ట్విట్టర్​లో ఫ్యాన్స్​ను కోరింది.

"ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు మరో వారం రోజుల సమయమే ఉంది. తుదిపోరులో న్యూజిలాండ్​తో తలపడడానికి టీమ్ఇండియాకు అభిమానుల మద్దతు అవసరం" అని బీసీసీఐ ట్వీట్​ చేసింది.

మరో ఏడు రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​(WTC Final) ముందు భారత జట్టు తమ ప్రాక్టీసును ముమ్మరం చేసింది. గెలుపే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తోంది. ఆటగాళ్లు వరుసగా రెండో రోజైన శుక్రవారం గ్రూప్​ ట్రైనింగ్​ సెషన్​లో పాల్గొన్నారు. ఆ వీడియోను బీసీసీఐ పోస్ట్​ చేసింది. డబ్ల్యూటీసీ కోసం జోరుగా సన్నద్ధమవుతున్నారని వెల్లడించింది.

ఇదీ చూడండి.. టీమ్​ఇండియా ప్రాక్టీస్​ హై ఇంటెన్సిటీతో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.