ETV Bharat / sports

చైనాకు భారత క్రికెట్​ జట్లను పంపించలేం.. కారణం అదే: బీసీసీఐ

చైనాలో జరగనున్న ఆసియన్​ గేమ్స్​ 2023లో భారత క్రికెట్​ జట్లు పాల్గొనడం లేదని బీసీసీఐ తెలిపింది. ఈ గేమ్స్​ జరిగే సమయంలో టీమ్ఇండియా పురుషుల, మహిళల జట్లకు ముఖ్యమైన మ్యాచ్​లు ఉన్నాయని పేర్కొంది.

bcci asian games 2023
bcci asian games 2023
author img

By

Published : Apr 21, 2023, 7:09 PM IST

చైనాలో జరగనున్న ఆసియన్ గేమ్స్​ 2023కి భారత క్రికెట్​ జట్లను పంపించలేమని భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. ఇది వరకే ఉన్న ఫ్యూచర్​ టూర్​ ప్రోగ్రామ్ కమిట్​మెంట్స్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ​కామన్‌వెల్త్‌ గేమ్స్‌ క్రికెట్​ ప్రవేశపెట్టిన తరహాలో ఆసియన్‌ గేమ్స్‌లో కూడా ఈసారి క్రికెట్‌ను ప్రవేశపెట్టారు. ఆసియన్ క్రీడలు సెప్టెంబర్​ 23 నుంచి అక్టోబర్​ 8 వరకు చైనాలో జరగనున్నాయి. బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై.. ఇండియా ఆసియన్‌ గేమ్స్‌ చీఫ్‌ భుపేందర్‌ భజ్వా స్పందించారు. ఈసారి ఆసియన్‌ గేమ్స్‌లో అన్ని విభాగాల్లో ఎంట్రీ పేర్లు ఇచ్చామని.. కానీ బీసీసీఐ నిర్ణయం మేరకు క్రికెట్‌లో ఇవ్వలేదని చెప్పారు.

అయితే ఇదే విషయంపై బీసీసీఐ స్పందించింది. ఆసియన్ గేమ్స్​ డెడ్​లైన్​కు ఒక రోజు ముందు తమకు ఐఓఏ (ఇండియన్ ఒలింపిక్​ అసోసియేషన్) నుంచి మెయిల్​ వచ్చిందని తెలిపింది. అప్పటికే ఫ్యూచర్​ టూర్​ ప్రోగ్రామ్​​లో భాగంగా భారత క్రికెట్​ పురుషుల, మహిళల జట్ల షెడ్యూల్​ పూర్తైందని చెప్పింది. ఆసియన్ గేమ్స్​ సమయంలో ముఖ్యమైన మ్యాచ్​లు ఉన్నాయని వెల్లడించింది. ఫ్యూచర్​ ప్రోగ్రామ్స్​లో భాగంగా.. స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్​ కప్​లో టీమ్​ఇండియా జట్టు ఆడనుంది. ఆ సమయంలోనే మహిళల క్రికెట్​ టీమ్​ దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్​తో మ్యాచ్​లు ఆడనుంది. ఆసియన్ గేమ్స్​ కూడా ఈ టైమ్​లోనే జరుగుతుండటం వల్ల బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఒకవేళ ఆసియన్ గేమ్స్‌లో టీమ్​ఇండియా పాల్గొనాలనుకుంటే బీసీసీఐకి ఒక దారి ఉంది. అయితే మహిళల క్రికెట్‌కు అవకాశం లేదు. కానీ పురుషుల జట్టు ఆడేందుకు ఆస్కారం ఉంది. వన్డే వరల్డ్​ కప్​లో సీనియర్‌ జట్టు ఆడుతుంది. కాబట్టి ఆసియన్‌ గేమ్స్‌కు టీమ్​ఇండియా జూనియర్‌ జట్టును పంపిస్తే బాగుంటుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం ఇదేం మొదటి సారి కాదు.

1998లో మలేసియా రాజధాని కౌలలంపుర్​లో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో టీమ్​ఇండియా పురుషుల జట్టు ఆడింది. అప్పుడే పాక్​తో టొరంటో వేదికగా జరిగిన మరో మ్యాచ్​లో భారత జట్టు వన్డే సిరీస్‌ను ఆడింది. 2021లోనూ టీమ్ఇండియా సీనియర్‌ జట్టు ఇంగ్లాండ్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లింది. ఆ సమయంలో శిఖర్‌ ధావన్‌ సారథ్యంలోని జూనియర్‌ టీమ్​ శ్రీలంకతో జట్టుతో వన్డే సిరీస్‌ ఆడింది. అప్పుడు ఈ ప్లాన్​ వర్కవుట్​ అయింది. దీంతో ఈసారి ఆసియన్ గేమ్స్‌లో కూడా ఇలాంటి ప్లాన్​ అమలు చేస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.