ETV Bharat / sports

మహిళల ఆసియా కప్​ జట్టును ప్రకటించిన బీసీసీఐ.. షెడ్యూల్ ఇదే

Womens Asia Cup India Squad : మహిళల ఆసియా కప్​ జట్టును ప్రకటించింది బీసీసీఐ. అక్టోబర్​ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్​కు 15 మందితో కూడిన జట్టును ఆల్ ఇండియా మహిళా సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టులో స్టార్​ బ్యాటర్​ స్మృతి మంధానతో పాటు ఎవరెవరు ఉన్నారంటే..

smriti mandhana
bcci-announced-womens-asia-cup-india-squad and schedule
author img

By

Published : Sep 21, 2022, 1:49 PM IST

Womens Asia Cup India Squad : మహిళల ఆసియా కప్ 2022 సీనియర్​ టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షా మీడియా అడ్వైజరీ జారీ చేశారు. బంగ్లాదేశ్​ అతిధ్యం ఇవ్వనున్న ఈ టోర్నమెంట్​.. అక్టోబర్ 1న ప్రారంభమై 15న ముగుస్తుంది.
ఈ కప్​ కోసం ఆల్ ఇండియా మహిళా సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును సెలెక్ట్​ చేసింది. జట్టులో హర్మన్​ ప్రీత్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), దీప్తి శర్మ. శఫాలీ వర్మ, జెనిమా రోడ్రిగ్స్​, సబ్బినేని మేఘన, రిచా ఘోష్​(వికెట్ కీపర్), స్నేహ్ రానా, దయలన్ హేమలత, మేఘన సింగ్, రేనుకా థాకూర్, పూజ వస్త్రాకర్, రాజేశ్వరీ గైక్వాడ్​, రాధా యాదవ్, కేపీ నవ్​గిరే ఉన్నారు. స్టాండ్​బై ప్లేయర్లుగా.. తనియా సప్న భాటియా, సిమ్రన్ దిల్ బహదూర్ ను ఎంపిక చేశారు.

అయితే ఆసియా కప్​ షెడ్యూల్​ను మంగళవారం ట్విట్టర్ వేదికగా జై షా ప్రకటించారు. మొదటి రోజు బాంగ్లాదేశ్​.. థాయిలాండ్​తో తలపడనుంది. అదే రోజు భారత్​.. శ్రీలంకతో, అక్టోబర్ 7న పాకిస్థాన్ మ్యాచ్​ ఆడనుంది. అక్టోబర్ 11వ తేది వరకు లీగ్ స్టేజ్ మ్యాచ్​లు జరగనున్నాయి. 13న సెమీ ఫైనల్, 15న ఫైనల్​ మ్యాచ్​లు జరగనున్నాయి.
బంగ్లాదేశ్​లో జరుగుతున్న 8వ ఎడిషన్​ ఆసియా కప్​లో ఏడు జట్లు పాల్గొంటున్నాయి. అందులో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్​తో పాటు ఇండియా, శ్రీలంక, పాకిస్థాన్, థాయిలాండ్, మలేసియా, యూఏఈ ఉన్నాయి. అయితే ఇండియా ఇప్పటివరకు ఆరు ఆసియా కప్​లు సొంతం చేసుకోవడం విశేషం.

ఇవీ చదవండి: టీమ్​ ఇండియా ప్లేయర్​కు ఆ నటి ప్రేమ సందేశం

టీమ్ ఇండియా అభిమానికి సారీ చెప్పిన వార్నర్​.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.