ఒలింపిక్స్‌లో అన్ని క్రీడలు కనిపిస్తాయి. కానీ, క్రికెట్‌కు మాత్రం చోటు లేదు. దీంతో జెంటిల్మెన్ గేమ్‌ను కూడా విశ్వక్రీడల్లో చేర్చాలనేది అభిమానుల నుంచి గత కొంతకాలంగా వినిపిస్తున్న డిమాండ్. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో (Los Angeles Olympics 2028) ఇది సాధ్యం కావొచ్చు. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ (BCCI Secretary) కార్యదర్శి జై షా స్పందించారు. అదే జరిగితే ఆ మెగా ఈవెంట్లో భారత్ పాల్గొంటుందని వెల్లడించారు.
ఈ విషయమై ఇంతకుముందే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంతో ఐసీసీ చర్చలు జరిపింది. కానీ, అప్పుడు బీసీసీఐ (BCCI) సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఆ ప్రయత్నాలు అర్ధంతరంగా ముగిశాయి. కానీ, ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టత ఇచ్చారు. క్రికెట్ విశ్వక్రీడల్లో భాగమైతే భారత్ పాల్గొంటుందని వెల్లడించారు. ఇందులో ఐసీసీతో కలిసి సాగుతామని పేర్కొన్నారు.
''టోక్యో ఒలింపిక్స్‌లో భారత బృందం ప్రదర్శనపై బీసీసీఐ సంతోషంగా ఉంది. దీంతో బీసీసీఐ తన వైఖరిని మార్చుకుంది. ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని.. భారత్‌కు మరిన్ని పతకాలు రావడానికి కృషి చేయాలని బోర్డు భావిస్తున్నట్లు'' అధికారి ఒకరు తెలిపారు.
1900 పారిస్ ఒలింపిక్స్‌లో తొలిసారిగా ఈ జెంటిల్మెన్ గేమ్‌కు అవకాశమిచ్చారు. ఇందులో ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్ జట్లు మాత్రమే పాల్గొన్నాయి. రెండ్రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్ 158 పరుగుల తేడాతో గెలుపొంది స్వర్ణ పతకం అందుకుంది. ఓడిపోయిన ఫ్రాన్స్ టీమ్‌కు రజతం దక్కింది. రెండే టీమ్‌లు పాల్గొనడం వల్ల కాంస్య పతకానికి అవకాశం లేకుండా పోయింది.
టీ20లతో సాధ్యమే..
లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో ఐసీసీ ఎనిమిది జట్లను బరిలో దించే అవకాశముంది. ప్రస్తుతమైతే టీ20 మ్యాచ్‌లు నాలుగు గంటల్లో ముగుస్తున్నాయి. 2028 వరకు వీలైతే అతిచిన్న ఫార్మాట్‌ను కూడా సృష్టించొచ్చు.
ఇదీ చదవండి: ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎందుకు లేదో తెలుసా?