BBL finals: బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్) 2021-22 సీజన్ ఫైనల్స్‌లో విజయం సాధించింది పెర్త్ స్కార్చర్స్. సిడ్నీ సిక్సర్స్‌పై 79 పరుగులు తేడాతో గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. దీంతో నాలుగు సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా నిలిచింది.
పెర్త్ స్కార్చర్స్ ఆటగాడు లారీ ఇవాన్స్ 76 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
-
The best in the biz 🏆🏆🏆🏆#BBL11 pic.twitter.com/W8bT9KligU
— KFC Big Bash League (@BBL) January 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">The best in the biz 🏆🏆🏆🏆#BBL11 pic.twitter.com/W8bT9KligU
— KFC Big Bash League (@BBL) January 28, 2022The best in the biz 🏆🏆🏆🏆#BBL11 pic.twitter.com/W8bT9KligU
— KFC Big Bash League (@BBL) January 28, 2022
మ్యాచ్ సాగిందిలా..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లారీ ఇవాన్స్ 76, ఆస్టన్ టర్నర్ 54 కీలక ఇన్నింగ్స్ ఆడారు. దీంతో సిడ్నీ సిక్సర్స్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది పెర్త్ స్కార్చర్స్.
172 లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ 92 పరుగులకే ఆలౌటైంది. బీబీఎల్ ఫైనల్లో మూడుసార్లు సిడ్నీ సిక్సర్స్‌పై పెర్త్ విజయం సాధించడం గమనార్హం.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: