ETV Bharat / sports

బౌన్సర్లను నిషేధించాల్సిన అవసరం లేదు: ఎంసీసీ

Banning bouncer MCC: గత కొన్నాాళ్లుగా క్రికెట్​లో బౌన్సర్లను నిషేధించాలంటూ వస్తోన్న వాదనలపై స్పందించింది మెరీల్​బోన్​ క్రికెట్​ క్లబ్. వాటిని నిషేధించాల్సిన అవసరం లేదని తెలిపింది. అలా చేస్తే ఆట విధానం మారిపోతుందని పేర్కొంది.

bouncer
short pitch bowling
author img

By

Published : Mar 6, 2022, 9:21 AM IST

Banning bouncer MCC: క్రికెట్‌లో బౌన్సర్లను నిషేధించాలంటూ కొద్ది కాలంగా వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించింది మెరీల్​బోన్​ క్రికెట్​ క్లబ్​. షార్ట్-పిచ్ బౌలింగ్‌ను నిషేధించాల్సిన అవసరం లేదని నిర్ణయం తీసుకుంది. ఫీల్డ్​లో షార్ట్-పిచ్డ్ బౌలింగ్ అనేది క్రీడలో భాగమని, దానిని మార్చడం ద్వారా ఆట విధానం మారుతుందని ఎం​సీసీకి చెందిన జామీ కాక్స్ అన్నారు. కాగా, ఐసీసీ ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక ఓవర్‌లో రెండు బౌన్సర్లకు మాత్రమే అనుమతి ఉంది.

బౌన్సర్ల వేగం ధాటికి బంతి హెల్మెట్​కు బలంగా తగిలి​ చాలా మంది క్రికెటర్లు కంకషన్‌ బారిన పడ్డారు. అప్పటి నుంచి బౌన్సర్లను నిషేధించడం ఒక్కటే మార్గమని చాలా మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ప్రమాదకర బౌన్సర్‌ కారణంగా ఆసీస్‌ మాజీ ఆటగాడు ఫిలిప్‌ హ్యూస్‌ మృతి చెందారు. ఆ తర్వాత బౌన్సర్లపై నిషేధం విధించాలన్న వాదన మరింత ఎక్కువైంది. ఆ ఆటగాడి అకాల మరణంతో హెల్మెట్​ డిజైన్​లో మార్పులు చేసింది ఎంసీసీ.

ఇదీ చదవండి: వార్న్‌ చివరి క్షణాల్లో ఏం చేశారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.