Bangla Review: సహజంగా ఎవరైనా అంపైర్ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే రివ్యూకు వెళ్లడం మనకు తెలిసిందే. ఆ బ్యాటర్ ఔట్ విషయంలో కచ్చితమైన ఫలితం కోసం డీఆర్‌ఎస్‌కు వెళతారు. చాలా మటుకు అవన్నీ ఎల్బీడబ్ల్యూ విషయాల్లోనే చోటుచేసుకుంటాయి. బంతి లైన్ అండ్ లెంగ్త్ విషయాల్లో లేదా ఆటగాడి బ్యాట్‌కు బంతి ఎడ్జ్‌లో తాకిందా లేదా అనే కోణాల్లో అక్కడ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. కానీ, తాజాగా కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా తీసుకున్న రివ్యూనే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
న్యూజిలాండ్ బ్యాటర్ రాస్ టేలర్ (37 బ్యాటింగ్; 101 బంతుల్లో 2x4).. 37వ ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తుండగా తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌కు వచ్చాడు. అప్పుడు అతడు ఒక యార్కర్ వేయగా టేలర్ బ్యాట్‌ను అడ్డుపెట్టి బంతిని అడ్డుకున్నాడు. దీనిపై బంగ్లా ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌటిచ్చాడు. కొద్ది క్షణాల్లో డీఆర్‌ఎస్ గడువు ముగుస్తుండగా బంగ్లా కెప్టెన్ మొమినుల్ హాక్ రివ్యూకు వెళ్లాడు. థర్డ్ అంపైర్ రిప్లేలో పరిశీలించగా.. ఆ బంతి చాలా స్పష్టంగా బ్యాట్‌కు మధ్యలో తాకుతున్నట్లు కనిపించింది. దీంతో కామెంట్రీ చేస్తున్న వ్యాఖ్యాతలు ఒక్కసారిగా నవ్వుకున్నారు. అలా బంతి బ్యాట్‌కు తాకుతున్నట్లు ఉన్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇది క్రికెట్ చరిత్రలోనే 'అత్యంత చెత్త రివ్యూ' అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు ఒకడుగు ముందుకేసి బంగ్లా జట్టును ట్రోల్ చేస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే.. బంగ్లా ఈ రివ్యూతో తనకున్న మూడు రివ్యూలను కోల్పోయింది.
-
Bangladesh have now used up all their DRS reviews 👀#SparkSport #NZvBAN pic.twitter.com/FM0FxYz1u0
— Spark Sport (@sparknzsport) January 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bangladesh have now used up all their DRS reviews 👀#SparkSport #NZvBAN pic.twitter.com/FM0FxYz1u0
— Spark Sport (@sparknzsport) January 4, 2022Bangladesh have now used up all their DRS reviews 👀#SparkSport #NZvBAN pic.twitter.com/FM0FxYz1u0
— Spark Sport (@sparknzsport) January 4, 2022
-
Bangladesh are doing so well this Test, but there should be some sort of penalty runs for this 😂pic.twitter.com/cc1gBUau4c
— Lachlan McKirdy (@LMcKirdy7) January 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bangladesh are doing so well this Test, but there should be some sort of penalty runs for this 😂pic.twitter.com/cc1gBUau4c
— Lachlan McKirdy (@LMcKirdy7) January 4, 2022Bangladesh are doing so well this Test, but there should be some sort of penalty runs for this 😂pic.twitter.com/cc1gBUau4c
— Lachlan McKirdy (@LMcKirdy7) January 4, 2022
-
Bangladesh just reviewed this. It was their third and final review. They still need eight wickets to bowl NZ out. But they do lead the Blackcaps.
— Jack Molloy (@jackomolloyo) January 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
PS: absolutely love the commentators reaction.#NZvBAN pic.twitter.com/Km79DZFA83
">Bangladesh just reviewed this. It was their third and final review. They still need eight wickets to bowl NZ out. But they do lead the Blackcaps.
— Jack Molloy (@jackomolloyo) January 4, 2022
PS: absolutely love the commentators reaction.#NZvBAN pic.twitter.com/Km79DZFA83Bangladesh just reviewed this. It was their third and final review. They still need eight wickets to bowl NZ out. But they do lead the Blackcaps.
— Jack Molloy (@jackomolloyo) January 4, 2022
PS: absolutely love the commentators reaction.#NZvBAN pic.twitter.com/Km79DZFA83
-
The Bangladesh cricket team and their DRS reviews #NZvBAN pic.twitter.com/UypoHFXenw
— Chillo (@ChilloSCT) January 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Bangladesh cricket team and their DRS reviews #NZvBAN pic.twitter.com/UypoHFXenw
— Chillo (@ChilloSCT) January 4, 2022The Bangladesh cricket team and their DRS reviews #NZvBAN pic.twitter.com/UypoHFXenw
— Chillo (@ChilloSCT) January 4, 2022
-
Great review from Bangladesh! Ball hit the middle of the bat…. @GuyHeveldt @TheACCnz pic.twitter.com/mF8vOzYyQ2
— Anand Reddy (@AnandSReddy) January 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Great review from Bangladesh! Ball hit the middle of the bat…. @GuyHeveldt @TheACCnz pic.twitter.com/mF8vOzYyQ2
— Anand Reddy (@AnandSReddy) January 4, 2022Great review from Bangladesh! Ball hit the middle of the bat…. @GuyHeveldt @TheACCnz pic.twitter.com/mF8vOzYyQ2
— Anand Reddy (@AnandSReddy) January 4, 2022
ఇక ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్ 147/5తో నిలిచింది. దీంతో ఆ జట్టు ప్రస్తుతం 17 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 458 పరుగులు చేసి మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ నాలుగో రోజు కాస్త పట్టుదలగా ఆడింది. ఇక చివరి రోజు మ్యాచ్ ఎలాంటి మలుపులు తీరుగుతుందో వేచి చూడాలి.