ETV Bharat / sports

స్టోక్స్‌ 'లా' వీరికీ అదృష్టం కలిసొచ్చింది!

క్రికెట్‌ చూసేందుకు ఎంత మజాగా ఉంటుందో.. ఆడేవారిపై ఒత్తిడీ ఎక్కువగానే ఉంటుంది. క్రీజ్‌లోకి వచ్చిన బ్యాటర్‌ను ఔట్‌ చేయాలంటే ప్రత్యర్థులకు చాలా పద్ధతులు ఉన్నాయి. బౌల్డ్‌, రనౌట్, స్టంపౌట్‌, ఎల్బీడబ్ల్యూ వల్ల పెవిలియన్‌కు పంపే అవకాశం ఉంది. ఇక తనంతట తానుగా హిట్‌ వికెట్‌ రూపంలోనూ బ్యాటర్‌ ఔటైన సందర్భాలూ ఉన్నాయి. ఎల్బీడబ్ల్యూ మినహా మిగతా వాటన్నింటిలోనూ స్టంప్స్‌తో సహా బెయిల్స్‌ ముఖ్య భూమిక పోషిస్తాయి. ఎల్బీ నిర్ణయం అంపైర్ల చేతుల్లో ఉంటుంది. బౌల్డ్‌, రనౌట్, స్టంపౌట్‌, హిట్‌ వికెట్ అయినప్పుడు తప్పనిసరిగా బెయిల్స్ వికెట్ల మీద నుంచి కింద పడాల్సిందే. లేకపోతే బ్యాటర్‌ నాటౌట్‌గా ఉన్నట్లే లెక్క. మరి అంతటి విలువైన బెయిల్స్‌ను బంతి తాకినప్పుడు పడకుండా బ్యాటర్లు బతికిపోయిన సందర్భాలూ ఉన్నాయి. మరి అవేంటో ఓ సారి గుర్తు చేసుకుందామా..

cricket news
క్రికెట్ న్యూస్
author img

By

Published : Jan 8, 2022, 6:57 PM IST

.
.

పై చిత్రం చూశారా.. బంతి వికెట్లను తాకుతున్నట్లుగా ఉంది కదా.. బ్యాటర్‌ ఔటైనట్లు అనుకోకండే.. ఎందుకంటే బంతి వికెట్లను తాకినా బెయిల్స్‌ పడకపోవడంతో బ్యాటర్‌ నాటౌట్‌గా నిలిచిన సంఘటనకు ప్రత్యక్ష సాక్ష్యం.. ఇంతకీ ఎవరంటారా..? ప్రస్తుత యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ బెన్‌ స్టోక్స్‌ ఇలానే బతికిపోయాడు.. ఈ ఘటన మీద మన క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారడం.. షేన్‌వార్న్‌, రికీ పాటింగ్‌ సహా క్రికెట్ అభిమానులు స్పందిచడం చకచకా జరిగిపోయాయి. యాషెస్‌ సిరీస్‌ నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్‌ బౌలర్‌ కామెరూన్ గ్రీన్‌ 142 కి.మీ వేగంతో సంధించిన బంతి వికెట్లను తాకుతూ వెళ్లినా బెయిల్స్‌ మాత్రం కిందపడలేదు. అప్పుడు క్రీజ్‌లో బెన్‌ స్టోక్స్‌ క్రీజ్‌లో ఉన్నాడు. రిప్లేలో చూసుకున్న స్టోక్స్‌ బతికిపోయాను రా... జీవుడా అంటూ నవ్వకోగా.. పాపం ఆస్ట్రేలియా ఆటగాళ్లు వికెట్‌ దక్కకపోవడంతో ఖంగు తిన్నారు. దీంతో బౌలర్లకు అనుకూలంగా కొత్త చట్టం తీసుకురావాలని సచిన్‌ పేర్కొనగా.. క్రికెట్‌ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని షేన్‌ వార్న్‌ బదులిచ్చాడు.

2019 వన్డే ప్రపంచకప్‌లో ఐదుసార్లు ఇలానే..

గత వన్డే ప్రపంచకప్‌లో ఐదుసార్లు ఇదే విధంగా బెయిల్స్ కిందపడకపోవడంతో బ్యాటర్లు బతికిపోయిన సంఘటనలు జరిగాయి. అందులో టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచూ ఉంది. ఛేదనకు దిగిన ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్ వార్నర్ అప్పటికి ఒకే ఒక్క పరుగుతో క్రీజ్‌లో ఉన్నాడు. భారత ఫాస్ట్‌బౌలర్‌ బుమ్రా వేసిన బంతి వార్నర్‌ బ్యాట్‌ను ముద్దాడుతూ బూట్‌ మీదుగా వెళ్లి వికెట్లను తాకింది. స్టంప్స్‌ నుంచి లైట్లు వెలిగినా బెయిల్స్‌ కిందకు పడకపోవడంతో వార్నర్‌ను ఔట్‌గా ప్రకటించలేదు అంపైర్లు. ఆ మ్యాచ్‌లో వార్నర్ (56) అర్ధశతకం సాధించినా ఆస్ట్రేలియా విజయం సాధించలేదు. దీంతో ఈ వ్యవహారంపై అప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగింది.

.
.

* ఇంగ్లాండ్‌ vs దక్షిణాఫ్రికా: ఇంగ్లాండ్‌ బౌలర్ అదిల్ రషీద్‌ బౌలింగ్‌లో క్వింటన్‌ డికాక్ బ్యాటింగ్ చేస్తున్నాడు. రషీద్ వేసిన బంతిని స్వీప్‌ షాట్ కొట్టేందుకు డికాక్‌ మిస్‌ అయిపోయి లెగ్‌ స్టంప్‌ను తాకింది. అయితే బెయిల్స్ కింద పడకపోవడం.. అది బౌండరీ వెళ్లిపోవడంతో డికాక్‌ బతికిపోయాడు. అర్ధశతకం (68) బాదినా జట్టును మాత్రం గెలిపించుకోలేకపోయాడు.

.
.

* బంగ్లాదేశ్‌ vs ఇంగ్లాండ్ : బంగ్లాదేశ్‌ బ్యాటర్‌కు అదృష్టం వెనుకనే దురదృష్టం ఉందేమో.. ఇంగ్లాండ్ బౌలర్‌ బెన్‌ స్టోక్స్‌ ఓవర్‌లో ఒకసారి బెయిల్‌ కింద పడకపోవడంతో తప్పించుకున్న సైఫుద్దీన్‌.. ఆ వెంటనే తర్వాతి బంతికే క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ముందు బంతిని వికెట్లను తాకినట్లు లైట్లు వెలిగినా బెయిల్స్‌ పడలేదు. దీంతో జీవదానం లభించినా సైఫుద్దీన్‌ వినియోగించుకోలేకపోయాడు.

* కివీస్‌ vs శ్రీలంక: ఈసారి శ్రీలంక కెప్టెన్‌కు అదృష్టం కలిసొచ్చింది. దిముత్‌ కరుణరత్నె 9 పరుగుల వద్ద ఉన్నప్పుడు న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ బౌలింగ్‌కు వచ్చాడు. మంచి బంతిని సంధించినా దురదృష్టం కొద్దీ వికెట్ మాత్రం దక్కలేదు. బంతి వికెట్లను తాకినా బెయిల్స్ కింద పడకపోవడంతో కరుణరత్నెను అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించారు. అయితే ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టుదే విజయం.

* ఆస్ట్రేలియా vs వెస్టిండీస్‌: డేంజరస్‌ బ్యాటర్‌కు ఇలాంటి అవకాశం వస్తే ఇంక ఏమైనా ఉందా..? అయితే దానిని సద్వినియోగం చేసుకోవడంలో యూనివర్సల్‌ బాస్‌ విఫలమయ్యాడనే చెప్పాలి. ఆసీస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో క్రిస్‌ గేల్‌కు ఐదు పరుగుల వద్ద రెండు సార్లు ప్రాణదానం లభించింది. అందులో ఒకసారి బంతిని బెయిల్‌ను తాకినా కింద పడకపోవడంతో బెనిఫిట్‌ పొందాడు. అయితే 21 పరుగులు వద్ద స్టార్క్‌ బౌలింగ్‌లోనే ఎల్బీగా ఔటై పెవిలియన్‌కు చేరడం గమనార్హం.

ఐపీఎల్‌లోనూ ఇలా రెండుసార్లు

.
.

ఇటువంటి సంఘటనలు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ చోటు చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. 2019 ఐపీఎల్‌ సీజన్‌లో రెండుసార్లు ఈ విధంగా జరిగాయి. అయితే అందులో ఒకటి రనౌట్‌ కాగా.. రెండోది బౌల్డ్‌.. ఈ ఘటనల్లో లైట్లు వెలిగినా బెయిల్స్‌ పడకపోవడంతో బ్యాటర్లను అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించారు.

* ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌, కింగ్స్‌ పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. సీఎస్‌కే తొలుత బ్యాటింగ్ చేసి 160 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన పంజాబ్‌ ఒకానొక దశలో మంచి స్థితిలోనే ఉంది. అప్పటికే కేఎల్‌ రాహుల్‌ అర్ధశతకానికి చేరువగా ఉన్నాడు. జడేజా వేసిన బంతికి సింగిల్‌ తీసేందుకు ప్రయత్నించాడు. అటువైపు సర్ఫరాజ్‌ వద్దు అనడంతో వెనక్కి వచ్చాడు. అయితే రెప్పపాటులో బంతిని అందుకున్న ధోనీ తనదైన స్టైల్‌లో వెనుక నుంచే వికెట్లకు గురి పెట్టి కొట్టాడు. అంతా ఔటే అనుకున్నప్పటికీ బెయిల్స్ మాత్రం కిందకపడకపోవడంతో థర్డ్‌అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. తర్వాత రాహుల్ (55), సర్ఫరాజ్‌ (67) మినహా ఎవరూ రాణించకపోవడంతో పంజాబ్ (138/5) ఓడిపోయింది.

* రాజస్థాన్‌ నిర్దేశించిన 140 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనను కోల్‌కతా దూకుడుగా ప్రారంభించింది. ఓపెనర్లు క్రిస్‌ లిన్, సునిల్ నరైన్ ధాటిగా ఆడారు. పాపం కీలకమైన సమయంలో వికెట్‌ దక్కే అదృష్టాన్ని రాజస్థాన్‌ బౌలర్‌ కులకర్ణి చేజార్చుకున్నాడు. ఫాస్ట్‌బౌలర్‌ అయిన కులకర్ణి వేసిన బంతి లెగ్‌ వికెట్‌ను తాకింది. ఔటైనట్లు భావించిన లిన్‌ పెవిలియన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే బెయిల్స్ కింద పడకపోవడంతో మెరిల్‌బోన్‌ క్రికెట్ క్లబ్‌ (ఎంసీసీ) రూల్‌ ప్రకారం నాటౌట్‌. దీంతో లిన్‌ను అంపైర్‌ ఔట్‌గా ప్రకటించలేదు. అంత వేగంతో వచ్చి వికెట్‌ను తాకిన బంతి బౌండరీకి వెళ్లడం.. బెయిల్స్‌ కింద పడకపోవడం గమనార్హం.

రెండు దశాబ్దాల కిందట ఇలాంటివి జరిగితే.. సరేలే బెయిల్స్‌ అన్నీ చెక్కతో తయారు చేసివని అని సర్దుకుపోవచ్చు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఎలక్ట్రానిక్‌ వికెట్లు, బెయిల్స్‌ వచ్చేశాయి. అందుకే బౌలర్లకు అనుకూలంగా క్రికెట్ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని మాజీలు భావిస్తున్నారు. లైట్లు వెలిగినా ఔట్‌ కాకపోవడం అదీనూ ఫాస్ట్‌ బౌలింగ్‌లో బెయిల్స్‌ కింద పడకపోవడంపై చాలా కాలంగా చర్చ సాగుతోంది. మరి అందరి సూచనలను, సలహాలను ఎంసీసీ పరిగణనలోకి తీసుకుని మార్పులు చేర్పులు చేస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.