ETV Bharat / sports

కోహ్లీని దాటేసిన బాబర్.. పాక్​ నాలుగో క్రికెటర్​గా రికార్డు - CRICKET NEWS

వన్డేల్లో తొలి ర్యాంక్​కు చేరుకున్న పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజామ్.. భారత కెప్టెన్ కోహ్లీని దాటేశాడు. ఈ మార్క్​ను అందుకున్న , పాక్ నాలుగో బ్యాట్స్​మన్​గా నిలిచాడు.

Babar dethrones Kohli from top of ICC men's ODI rankings
కోహ్లీ బాబర్ ఆజామ్
author img

By

Published : Apr 14, 2021, 3:18 PM IST

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్.. కోహ్లీని అధిగమించాడు. గత మూడేళ్ల నుంచి వన్డే ర్యాంకింగ్స్​లో టాప్​లో ఉన్న విరాట్​ను వెనక్కు నెట్టి, ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డేలో 94 పరుగులు చేసిన బాబర్.. 13 రేటింగ్ పాయింట్లు సాధించి, అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఇతడు 865, కోహ్లీ 857 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

ICC ODI RANKINGS LATEST
ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్

పాక్​ తరఫున వన్డేల్లో టాప్ ర్యాంక్ అందుకున్న నాలుగో బ్యాట్స్​మన్ బాబర్. ఇతడి కంటే ముందు జహీర్ అబ్బాస్, జావేది మియాందాద్, మహమ్మద్ యూసఫ్ ఈ ఘనత సాధించారు.

బ్యాట్స్​మెన్​లో టీమ్​ఇండియా ఆటగాడు రోహిత్ శర్మ మూడో స్థానంలో, బౌలర్లలో బుమ్రా నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఆల్​రౌండర్ల టాప్-10 మన జట్టు నుంచి అశ్విన్ ఒక్కడే చోటు దక్కించుకున్నాడు.

ఇది చదవండి: ధోనీ, కోహ్లీలను అధిగమించి ఫకర్ ప్రపంచ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.