పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా 2వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సరికొత్త ఫీట్ నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీని అధిగమించాడు అజామ్.
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న చివరి టీ20లో.. అజామ్ ఈ ఫీట్ సాధించాడు. భారత సారథి కోహ్లీ 56 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా.. బాబర్ కేవలం 52 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డును అందుకున్నాడు. తర్వాతి స్థానాల్లో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్(62 ఇన్నింగ్స్‌ల్లో), కివీస్ మాజీ సారథి మెక్ కల్లమ్(66 ఇన్నింగ్స్‌ల్లో) ఉన్నారు.
కోహ్లీ 52.65 సగటుతో టీ20ల్లో 3,159 రన్స్‌తో అత్యధిక పరుగుల జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. బాబర్ 2,035 రన్స్‌తో 11వ స్థానంలో నిలిచాడు.
ఇదీ చదవండి: 'శుభ్‌మన్ ఆ జాబితాలో తప్పక ఉంటాడు'
ఇదీ చదవండి: జడేజా ఆల్‌రౌండ్ షో.. చెన్నై సూపర్ విక్టరీ