Avesh Khan Replaced Shami : సౌతాఫ్రికా పర్యటన టెస్టు సిరీస్‌లో పేసర్ మహ్మద్ షమీ స్థానాన్ని యంగ్ ప్లేయర్ ఆవేశ్ ఖాన్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఆవేశ్ జట్టుతో కలవనున్నాడు. ఈ పర్యటనతోనే అవేశ్ ఖాన్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇక సౌతాఫ్రికా- భారత్ మధ్య రెండో టెస్టు జనవరి 3న ప్రారంభం కానుంది. కాగా తొలి టెస్టులో సఫారీ జట్టు ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో నెగ్గి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
Shami Ruled Out : టీమ్ఇండియా బౌలర్ మహ్మద్ షమీ ఇటీవల గాయపడ్డాడు. కాలిచీలమండల (Ankle Injury) గాయం నుంచి కోలుకుంటున్న షమీ పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. ఈ కారణంగా షమీ సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌కు ఎంపికకాలేదు. కాగా, తాజాగా అతడి రిప్లేస్‌మెంట్‌గా ఆవేశ్‌ను బీసీసీఐ ప్రకటించింది.
-
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) December 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Avesh Khan added to India’s squad for 2nd Test.
Details 🔽 #TeamIndia | #SAvINDhttps://t.co/EsNGJAo8Vl
">🚨 NEWS 🚨
— BCCI (@BCCI) December 29, 2023
Avesh Khan added to India’s squad for 2nd Test.
Details 🔽 #TeamIndia | #SAvINDhttps://t.co/EsNGJAo8Vl🚨 NEWS 🚨
— BCCI (@BCCI) December 29, 2023
Avesh Khan added to India’s squad for 2nd Test.
Details 🔽 #TeamIndia | #SAvINDhttps://t.co/EsNGJAo8Vl
బ్రేక్ తీసుకున్న ఇషాన్: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇటీవల ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. గత కొంతకాలంగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న కారణంగా అతడికి రెస్ట్ ఇవ్వాల్సిందిగా బీసీసీఐని ఇషాన్ కోరాడు. దీంతో అతడి అభ్యర్థన మేరకు బీసీసీఐ కూడా విశ్రాంతినిచ్చింది. సెలక్షన్ కమిటీ అతడి స్థానంలో కేఎస్ భరత్‌ను ఎంపికచేసింది. కాగా ఇప్పటికే భరత్ జట్టుతో కలిశాడు.
India vs South Africa 2nd Test : సౌతాఫ్రికా- భారత్ మధ్య జనవరి 3న రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా జరగనుంది.
2వ టెస్టుకు భారత్ టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరణ్, ఆవేశ్ ఖాన్.
ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాకు రెండు షాక్‌లు టాప్ ప్లేస్ ఔట్, ఐసీసీ ఫైన్!
విరాట్ కోహ్లీ సెన్సేషన్- 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా రికార్డు